యాదాద్రి భువనగిరి జిల్లా:బీబీనగర్ మండలంలో పని చేస్తున్న జూనియర్ మరియు ఔట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శులు( Panchayat Secretaries ) క్రమబద్దీకరణకై కొన్ని రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి( Guduru Narayana Reddy ) సంఘభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీ కార్యదర్శుల ప్రోహిబిషన్ పీరియడ్ దాటినప్పటికీ కూడా ప్రభుత్వం రెగ్యులరైజ్ చెయ్యకుండా వారి జీవితాలతో ఆడుకుంటుందన్నారు.
సుదీర్ఘ ప్రాంతాల నుండి ప్రయాణిస్తూ ఉద్యోగాలు చేస్తున్న పంచాయితీ కార్యదర్శులను ఇబ్బంది పెట్టడం ముఖ్యమంత్రి కేసిఆర్( CM KCR ) కి సమంజసం కాదని,ముఖ్యమంత్రి కుటుంబం స్కాంలు చేస్తూ జేబులు నింపుకోవడం తప్ప ప్రజలకు సర్వీస్ చేసే ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయడంలో శ్రద్ద చూపించడం లేదని విమర్శించారు.అంతేకాకుండా జూనియర్ పంచాయితీ కార్యదర్శులను ప్రోహిబిషన్ కాలం పూర్తి కాగానే రెగ్యులర్ చేయాలని,ఔట్ సోర్సింగ్ కార్యదర్శులను జూనియర్ కార్యదర్శులుగా మారుస్తూ రెగ్యులర్ చేయాలని మరియు విధినిర్వహణలో చనిపోయిన పంచాయితీ కార్యదర్శుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.







