సమాజంలో జరిగే కొన్ని దారుణాలు చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తాయి.కొందరు వ్యక్తులు చేసే దోపిడీలు, దారుణ హత్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి.
ఎందుకంటే చాలా సింపుల్ గా తమ టార్గెట్ పూర్తి చేసేస్తారు.ఇలాంటి అన్ని కొందరికి వెన్నతో పెట్టిన విద్య.
తమిళనాడులోని కోయంబత్తూర్( Coimbatore ) లో ఓ విచిత్రమైన దోపిడీ చేసింది ఓ కిలాడీ లేడీ.ఈమె చేసిన దోపిడీ గురించి తెలిసి స్థానికులతో పాటు పోలీసులే షాక్ అయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.కిలాడీ లేడీ తన స్నేహితురాలికి ఎంతో ప్రేమగా కోడికూర వడ్డించి, మత్తులోకి జారుకున్నాక కోట్ల రూపాయలతో పాటు బంగారు ఆభరణాలను కాజేసి పారిపోయిన ఘటన తమిళనాడు కోయంబత్తూర్ లోని రామనాథపురం( Ramanathapuram ) కృష్ణ కాలనీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాజేశ్వరి అనే మహిళ తో వర్షిణి అనే యువతి పరిచయం చేసుకుంది.తర్వాత తమ వద్ద చాలా మంది కస్టమర్స్ ఉన్నారని, వాళ్లంతా వేలాది ఎకరాలు కొనడం కోసం ప్రయత్నిస్తున్నారని రాజేశ్వరి కి తెలిపింది.దీంతో రాజేశ్వరి ఆ కస్టమర్లను తన వద్దకు తీసుకురావాలని వర్షిణి కి చెప్పింది.
అనంతరం వర్షిణి తనతో పాటు అరుణ్ కుమార్, సురేంద్రన్, ప్రవీణ్ ( Arun Kumar, Surendran, Praveen )అనే ముగ్గురు స్నేహితులను రాజేశ్వరి ఇంటికి తీసుకువెళ్లింది.కాసేపు అందరూ మాట్లాడుకున్న తర్వాత భోజనం చేస్తూ సడన్ గా రాజేశ్వరి స్పృహ కోల్పోయి కింద పడింది.వెంటనే వర్షిణి తన స్నేహితులతో కలిసి ఇంట్లో ఉండే 2.5 కోట్ల నగదు, 100 సవర్ల బంగారు ఆభరణాలతో పరారయ్యింది.కాసేపటికి మత్తు నుంచి చేరుకున్న రాజేశ్వరి తన ఇంట్లో దోపిడీ జరిగినట్లు గ్రహించింది.ఇక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వర్షిణి తో పాటు ఆమె స్నేహితులపై కేసు నమోదు అయ్యింది.
పోలీసుల విచారణలో బయట నుండి తెచ్చిన కోడి కూర పెట్టి రాజేశ్వరి ఇంట్లో దోపిడికి పాల్పడ్డారని తేలింది.దీంతో వర్షిణి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కానీ వర్షిణి పరారీలో ఉంది.వర్షిణి విదేశాలకు పారిపోయినట్లు ఆమె స్నేహితులు పోలీసులకు తెలిపారు.








