ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే డార్క్ సర్కిల్స్ వారం రోజుల్లో మాయం అవుతాయి!

డార్క్ సర్కిల్స్.చాలా కామన్ గా వేధించే సమస్యల్లో ఒకటి.

 Follow This Simple Tip To Get Rid Of Dark Circles! Simple Tip, Dark Circles, Dar-TeluguStop.com

కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి డార్క్ సర్కిల్స్ కు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.అలాగే ఆహారపు అలవాట్లు, ఎండల ప్రభావం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.

ఏదేమైనా ఇవి కళ్ళను, ముఖాన్ని అందవిహీనంగా మారుస్తాయి.మీరు కూడా డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా.? వాటిని వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

Telugu Tips, Dark Circles, Darkcircles, Latest, Simple Tip, Skin Care, Skin Care

ఈ సింపుల్ చిట్కా పాటిస్తే వారం రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.మరి ఇంకెందుకు లేటు ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్‌ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్( Muleti powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Latest, Simple Tip, Skin Care, Skin Care

ఇప్పుడు ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఉదయం స్నానం చేయడానికి ముందు మరియు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ క్రీమ్ ను వాడటం వల్ల డార్క్ సర్కిల్స్( Dark circles ) దెబ్బకు పరార్ అవుతాయి.సహజంగానే డార్క్ సర్కిల్స్ ను నివారించడానికి ఈ సింపుల్ చిట్కా చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

పైగా కళ్ళ వద్ద ఏమైనా ముడతలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.కళ్ళు అందంగా ఆకర్షణీయంగా మారతాయి.కాబట్టి డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube