జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి మరియు హీరోయిన్ అనుష్క శెట్టి( Anushka ) కీలక పాత్ర లో నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Miss Shetty Mr Polishetty ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమా మొదట అనుకున్న ప్రకారం మే 26వ తారీఖున విడుదల అవ్వాల్సి ఉంది.

కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కానందున సినిమా ను జూన్ లేదా జూలై నెలకు వాయిదా వేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ కలుగుతోంది.ఈ రెండు నెలల్లో ఏదో ఒక నెలకి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాని ప్రేక్షకుల మందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.
అతి త్వరలోనే సినిమా కి సంబంధించిన విడుదల తేదీ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.యూవీ క్రియేషన్స్ బ్యానర్( UV Creations ) లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు.

సినిమా చిత్రీకరణ కి సంబంధించిన ఒక మేకింగ్ వీడియో ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలలోనే సినిమా లో విడుదల చేసేవాళ్లు…కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాక పోవడంతో మరో మారు ఈ సినిమా ని వాయిదా వేసినట్లుగా సమాచారం అందుతుంది.అతి త్వరలోనే సినిమా నుండి ట్రైలర్ ని విడుదల చేసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక నవీన్ పోలిశెట్టి( Naveen polishetty ) మరియు అనుష్క శెట్టి ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింతగా క్లోజ్ అవ్వబోతున్నారు అంటూ యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.సినిమా ఎప్పుడు విడుదల అయినా కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుంది అంటూ యూవీ క్రియేషన్స్ వారు ధీమాతో ఉన్నారు.అనుకున్నట్లుగా జరిగి ఈ నెలలోనే సినిమా విడుదల అయ్యి ఉంటే సమ్మర్ హాలీడేస్ ను చిత్రం సద్వినియోగం చేసుకునేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.







