కాంగ్రెస్ పార్టీలో ఐకానిక్ లీడర్ అయిన ఇందిరాగాంధీ రూపంతో పాటు చక్కటి వాగ్దాటి ,సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న ప్రియాంక గాంధీ( Priyanka gandhi ) దేశ రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ శ్రేణులు బలంగా కోరుకుంటున్నాప్పటికీ ఆమె ఇంతకాలం అమేధి నియోజకవర్గానికే పరిమితమయ్యారు .తల్లి ,అన్న దేశవ్యాప్త ప్రచారానికి వెళ్తున్నప్పుడు వారు పోటీ చేసే నియోజక వర్గా లలో గెలుపు బాధ్యతను ఆమె తీసుకునేవారు .
రాహుల్ గాంధీ పాలిటిక్స్ పట్ల అంత ఆసక్తి చూపించడం లేదని ఆయన సిన్సియర్ రాజకీయవేత్త కాదని కాంగ్రెస్లోని కొన్ని వర్గాలే భావిస్తున్న సమయంలో ప్రియాంక గాంధీని ప్రత్యామ్నాయంగా చాలామంది భావించేవారు.అయితే ఆమె ఎప్పుడూ కూడా ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధపడలేదు … రాహుల్ గాంధీ( Rahul gandhi ) కూడా క్రమంగా యాక్టివేట్ కావడం దేశవ్యాప్త పాదయాత్ర చేయటం లాంటి పరిణామాలతో ప్రియాంక గాంధీ రాకను కోరుకునే వారు సైలెంట్ అయ్యారు.

అయితే కాంగ్రెస్కు చావో రేవో లాంటి ఎన్నికలు కావడం తో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు అవకాశమున్న అన్ని వనరులను సమీకరిస్తుంది.కర్ణాటక ఎన్నికలు( Karnataka Assembly election ) వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ అనే భావిస్తున్న తరుణంలో అక్కడ ప్రచార బాధ్యతలు పూర్తిస్థాయిలో ప్రియాంక గాంధీ చేపట్టారు.బహిరంగ సభలు రోడ్ షోలతో అక్కడ ప్రజల నాకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంతవరకు ప్రియాంక బయట రాష్ట్రాల్లో ప్రచారం చేయనందున ఆమె రోడ్ షోలకు విపరీతమైన స్పందన వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ముందంజలో ఉన్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ పర్యటన అక్కడ మరింత పాజిటివ్ వేవ్ ని తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది .బిజెపి ప్రభుత్వ పరిపాలన పై సూటి ప్రశ్నలు సంధిస్తున్న ఆమె ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొంటున్నారు.

ఆమె ప్రచారం కేవలం కర్ణాటకకే పరిమితం కాకుండా మరొ కొన్ని నెలలో ఎన్నికలు జరగబోయే తెలంగాణలో కూడా ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి .ఇంతకాలం ఒక నియోజకవర్గానికే పరిమితమైన ఆమె ఇప్పుడు దేశవ్యాప్త ప్రచారం బాధ్యతలు తీసుకోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరింత ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు….కాంగ్రెస్కు పునర్ వైభవం తీసుకొచ్చే దిశగా ఆమె ప్రయత్నాలు చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి మరి ప్రియాంక ఎంట్రీ తో అయినా కాంగ్రెస్కు పునర్ వైభవం వస్తుందో లేదో చూడాలి.







