ఇటీవల ఆయన వ్యాఖ్యలు సరలి చూస్తే ఆయన తొందరలోనే తెలుగుదేశం ప్రవేశం చేస్తున్నారన్న అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి .ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నా కూడా ఆ పార్టీ పనితీరుపై సంతృప్తి లేని ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారంటూ వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి ఆయనే విశాఖపట్నం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు( Vishnu kumar ).తెలుగుదేశం అనుకూల ఛానల్ అయిన ఆంధ్రజ్యోతిలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే( Open Heart With RK ) అన్న ప్రోగ్రాం లో పాల్గొన్న ఆయన బిజెపి పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ ఛానల్ రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా అర్థమవుతుంది…

ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని సంచలన స్టేట్మెంట్ లను ఆ ఛానల్ ప్రోమోగా రిలీజ్ చేసింది …ఆ ప్రోమో లో .వైయస్ జగన్ ప్రభుత్వం పై ( CM Jagan )తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన హైదరాబాద్ అభివృద్ధిని చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ తో ఆంధ్రప్రదేశ్ ను పోల్చి చూసినప్పుడు తమకంట కన్నీరు వస్తుందంటూ అని చెప్పుకొచ్చారు .భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఒక రాష్ట్రం దిగజారి పోవడం ఎప్పుడూ చూడలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పరిస్థితి ఏమంత గొప్పగా లేదనిఒప్పుకున్న ఆయన తమకు ఒక్క సీటు కూడా రాదంటూ తాను ప్రధానమంత్రి అడిగినప్పుడు చెప్పానని కుండబద్దలు కొట్టారు అయినా సరే ప్రయత్నించమంటూ ప్రధానమంత్రి ధైర్యం చెప్పారని, అయితే వైసిపితో కలిసి లోపాయి కారి ఒప్పందంలో ఉన్నామన్నవిమర్శలు పార్టీకి చాలా నష్టం కలగజేశాయని అంగీకరించారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాజయనికి ప్రజలు ఆ విమర్శలను నమ్మటమే కారణమంటూ ఆయన చెప్పుకొచ్చారు .

తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారా అన్న ఆర్కే ప్రశ్నకు మాత్రం ఆయన నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు పెళ్లికాకముందే బిడ్డ పేరు అడుగుతున్నారంటూ ఆయన నవ్వేశారు ఆయన వాఖ్యల బట్టి చూస్తే బీజేపీ రాజకీయ( BJP ) ఎదుగుదలపై ఆయనకు అంత నమ్మకం లేదని,అందుకే తెలుగుదేశంలో చేరడానికి సుముఖత చూపిస్తున్నారని చంద్రబాబు కూడా అందుకు అనుకూలంగా ఉన్నందున త్వరలోనే ఆయన తెలుగుదేశంలోకి చేరడంపై ముహూర్తం ఖరారు అవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి .







