'స్పై' నుండి ఈ రోజు బ్లాస్టింగ్ అప్డేట్.. నిఖిల్ మరో హిట్ అందుకుంటాడా?

ఈ మధ్య ప్రేక్షకుల ఆలోచన విధానంలో చాలా మార్పు రావడం వల్ల సినిమాలో కంటెంట్ ఉంటే ఎంత చిన్న సినిమాను అయిన బిగ్గెస్ట్ హిట్ గా నిలుపుతున్నారు.అదే కంటెంట్ లేకపోతే స్టార్ హీరోల సినిమాలను కూడా అట్టర్ ప్లాప్ చేస్తున్నారు.

 Nikhil’s Spy Blasting Update To Be Out From Today, Nikhil Siddharth, Spy, Tol-TeluguStop.com

దీంతో చిన్న హీరోలు కూడా మంచి కంటెంట్ తో వచ్చి పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు.

ఇక తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నిఖిల్ ( Nikhil Siddharth ) ఒకరు.ఈయన కూడా ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో వచ్చి పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ కార్తికేయ 2 ( Karthikeya 2 ) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ (18 Pages) కూడా మంచి విజయం సాదించింది.

ఇలా వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న నిఖిల్ ఇప్పుడు కొత్త చిత్రంతో త్వరలోనే మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”స్పై”( SPY ).యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ ( Garry BH ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాను ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.ఆర్యన్ రాజేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.ఈ పాన్ ఇండియన్ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఈ రోజు బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతుంది అని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా చెప్పాడు.

దీంతో ఎలాంటి అప్డేట్ వస్తుందో అని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి ఈ సినిమాతో నిఖిల్ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube