అల్లరి నరేష్ ( Allari Naresh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా టాలీవుడ్ లో ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.
అల్లరి సినిమాతో మొదలైన నరేష్ అల్లరి చాలా సినిమాల వరకు కొనసాగుతూనే వచ్చింది.తనదైన నటన, కామెడీతో ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన నరేష్ ఒక్కసారిగా ప్లాప్స్ అందుకుంటూ వచ్చాడు.
మంచి మంచి హిట్స్ అందుకుంటున్న సమయంలో ప్లాప్ సినిమాల కారణంగా అల్లరి నరేష్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.హిట్స్ ప్లాప్స్ సంబంధం లేకుండా సినిమాలు చేసే అల్లరి నరేష్ ప్లాప్స్ దెబ్బతో ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ వస్తున్నాడు.
ఇక నాంది సినిమాతో కామెడీ ట్రాక్ వదిలి సీరియస్ ట్రాక్ లోకి వచ్చిన అల్లరి నరేష్ అప్పటి నుండి మళ్ళీ అలాంటి సినిమాలనే ఎంచుకుంటున్నాడు.

ఇక ఇప్పుడు ”ఉగ్రం” ( Ugram ) సినిమా చేసిన నరేష్ మే 5న అంటే ఈ రోజు ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిజల్ట్ కూడా రాబోతుంది.ఈ క్రమంలోనే అల్లరి నరేష్ తన సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.

”తొలి సినిమా అల్లరి నుండి మీరు నన్ను ఆదరిస్తూ వస్తున్నారు.ప్రస్తుతం నా కెరీర్ 60వ సినిమాగా ఉగ్రం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది.దీని ద్వారా సరికొత్తగా మీ అందరి ముందుకు రాబోతున్న నాకు మరోసారి మీ ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను” అంటూ ఈయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.

ఇక విజయ్ కనకమేడల ( Vijay Kanakamedala ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మిర్నా ( Mirnaa ) హీరోయిన్ గా నటించింది.నరేష్ ఈ సినిమాలో తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.చూడాలి ఎలాంటి హిట్ అందుకుంటాడో.







