రాజన్న సిరిసిల్ల డిపో నుండి పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం( Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple ) వరకు ,వివిధ వ్యాపార వాణిజ్య పనుల కోసం హైదరాబాద్ వెళ్తూ ఉంటారు.వీరి సౌకర్యార్థం బస్ లను ఏర్పాటు చేయాలని ఇటీవల ఆర్ టి సి ఎం డి సజ్జనార్ ను కలిసి ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ హైదరాబాద్ లోని బస్ భవన్ లో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఆర్ టి సి ఎం డి సజ్జనార్ ఆదేశాల మేరకు మంగళవారం సిరిసిల్ల ఆర్ టి సి డిపో( Sircilla RTC Depot ) ఎస్ టి ఐ ఏల్.సారయ్య సేఫ్టీ డ్రైవర్ లకావత్ పర్శరాం బస్ రూట్ సర్వే చేశారు.మొదటి దశలో సిరిసిల్ల ఆర్ టి సి డిపో నుండి బస్ బయలుదేరి ఎల్లారెడ్డిపేట, బండలింగంపల్లి, ముస్తాభాద్ మీదుగా సిద్దిపేట వరకు బస్ ను నడుపనున్నట్లు టి ఎస్ ఆర్ టి సి బస్ భవన్ నుండి సంక్షిప్త సమాచారం తనకు పంపినట్లు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు.భవిష్యత్ లో ప్రయాణీకుల రాకపోకలు దృష్టిలో పెట్టుకొని సిరిసిల్ల ఆర్ టి సి డిపో నుండి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కు అదే విధంగా హైదరాబాద్( Hyderabad ) కు నేరుగా బస్ నడపనున్నట్లు ఆర్ టి సి అదికారులు తెలిపారు.
త్వరలోనే ఇట్టి బస్ ను ప్రారంభించనున్నట్లు ఆర్ టి సి అధికారులు తెలిపారని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.







