ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా "ఠాణా దివస్"

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “ఠాణా దివస్” ( Thana Divas )ప్రజల వద్ద నుండి స్వయంగా వినతులు స్వీకరించి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ప్రజల వద్ద నుండి 112 ఫిర్యాదులు స్వీకరణ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా:గ్రామా స్థాయిలో నెలకొన్న శాంతి భద్రత సమస్యలు,ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “ఠాణా దివస్”ప్రతి నెల మొదటి మంగళవారం రోజున ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్నాం అని అందులో భాగంగా గురువారం ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుండి 112 అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ).ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువగా వెళ్ళడానికి “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని,గ్రామాల్లో ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోగ్రామ్స్ నిర్వహిస్తు ప్రజలతో మమేకం అవుతూ గ్రామాలలో శాంతి భద్రతను పరిరక్షణకై కృషి చేస్తున్నామని అన్నారు.

 thana Divas Aims To Solve People's Problems , She Team, Sakhi Centre, thana Diva-TeluguStop.com

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి వారి సమస్యలని అడిగి తెలుసుకుని అట్టి సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించడం జరిగిందని, తమ పరిధిలో లేని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకవెళ్తామని,సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతున్నరు.కుంటుంబ సంబంధిత సమస్యలు షీ టీమ్,సఖి సెంటర్( She Team, Sakhi Centre ) వారి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.

భూ సమస్యలలో క్రిమినల్ సమస్య ఉంటే వాటిలో సంబంధించిన అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భూములను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేయాలని సూచించారు.

సివిల్ సమస్యలకు సంబంధించి లీగల్ సర్వీసెస్ అథారిటీ( Legal Services Authority ) వాళ్ళతో అవగాహన కల్పిస్తాం అన్నారు.ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ సమస్యలు మేము పరిష్కరిస్తామని డబ్బులు వసూలు చేసే వారిపై మాకు ఫిర్యాదులు వస్తే చట్టపరపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.

శాంతి భద్రతలను కాపాడటానికి పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తుదని,శాంతి భద్రతల కు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తప్పవని,శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు.

కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని,వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయడం జరుగుతుంది, శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చు సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని అన్నారు.

అలాగే యువత అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని,గంజాయికు అలవాటు పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని,కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో లో స్థిరపడి తల్లి తండ్రులకు మంచి పెరు తీసుకరావలన్నారు.గంజాయికి అలవాటుపడి మనేయలేని పరిస్థితులలో ఉన్న వారిని మా దగ్గరికి తీసుకువస్తే సైకాలజిస్ట్ తో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అన్నారు.

గంజాయి నిర్ములనకు పోలీస్ శాఖ కృషి చేస్తుదన్నరు.గత నెల 4 వతే దీన వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన “ఠాణా దివస్” కార్యక్రమంలో 53 ఫిర్యాదులు వచ్చాయని అందులో 13 ఫిర్యాదులపై ఎఫ్ ఐ ఆర్ చేసి కేసులు నమోదు చేయడం జరిగింది.

కొన్ని ఫిర్యాదులలో ఇరు వర్గాల వారిని పిలిపించి వారి సమస్యలను పరిష్కరించామని, సివిల్ సమస్యలలో కోర్టు వెళ్లాలని సూచించమని,కోర్టు ని ఏ విధంగా సంప్రదించలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి అవగాహన కల్పించడం జరిగింది.జిల్లా ఎస్పీ స్వయంగా తమ దగ్గరికి వచ్చి ఓపికతో తమ ఫిర్యాదులు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్న అర్జీదారులు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ విస్వప్రసాద్, సి.ఐ మోగిలి, ఎస్.ఐ శేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube