Dada Saheb Phalke: ఇండియాకు సినిమాను తెచ్చి కటిక దరిద్రం అనుభవించిన పాల్కే.. ఈ రోజు వేల కోట్ల సినిమాలు

ఈ రోజు సినిమా అంటే ఒక రంగుల ప్రపంచం .తెర పైన జరిగే మాయాజాలం.

 Dada Saheb Phalke Last Days-TeluguStop.com

తెరవెనక కోట్ల రూపాయల వ్యాపారం.ప్రత్యేక్షం గా వందల మందికి ఉపాధి, పరోక్షం గా వేల మందికి జీవనాదారం.

మరి ఇంతటి వైభోగం, గ్లామర్, సెలెబ్రిటీ హోదా వాటితో వచ్చే ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా ఒక్క సినిమా చుట్టే జరుగుతూ ఉంటాయి.మరి ఇంత మందికి నచ్చిన సినిమాను మనకు పరిచయం చేసింది దాదా సాహెబ్ పాల్కే.

( Dada Saheb Phalke ) పాశ్చాత్య దేశాలలో నేర్చుకున్న పరిజ్ఞానం తో తన దగ్గర ఉన్న డబ్బుతో మొదటి సారి సినిమాను తీయడం నేర్చుకొని రాజా హరిశ్చంద్ర సినిమా( Raja Harishchandra Movie ) తీసాడు.

అద్భుతంగా విజయం సాధించింది.ఆయన వరస పెట్టి తీస్తున్న సినిమాలకు వాణిజ్య పరంగా ఆదాయం రావడం మొదలయ్యింది.కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చింది.1914 లో సినిమా తీయడానికి లండన్ వెళ్ళాడు.మొదటి ప్రపంచ యుద్ధం( First World War ) జరుగుతున్న టైం కావడం తో అక్కడే ఇరుక్కుపోయి డబ్బు ఇండియా కు వచ్చేసాడు.

లండన్ నుంచి రాగానే భార్య నగలను అమ్మేసి కుటుంబం పై ఒక 200 అడుగుల నిడివి తో ఒక సినిమా తీసి సినిమాల్లో నటించడం ఒక పాపం గా భావిస్తున్న రోజులో నటీనటుల కోసం వేశ్య వాటికలో తిరిగే వాడు.ఒక హోటల్ లో పని చేసే సలుంకీలే అనే కార్మికుడితో రాముడు మరియు సీత పాత్ర వేయించి లంక దహనం అనే సినిమా తీస్తే అది పెద్ద సక్సెస్ అయ్యింది.సినిమాను టెక్నీకల్ గా డెవలప్ చేయడం కోసం విదేశాల నుంచి ఎక్విప్ మెంట్ తెప్పించేవారు.

ఆయన జపాన్ నుంచి తెప్పించిన మొట్ట మొదటి కెమెరా ఎక్కడ ఉందో ఇప్పుడు ఎవరికి తెలియదు.సినిమాలో మేజిక్ ట్రిక్స్ కూడా ఎలా వాడాలో ఆయనే కనిపెట్టారు.హిందుస్థాన్ ఫిలిం కంపెనీ మొదట్లో ఫాల్కే సినిమాలను విడుదల చేసేది.

అది తర్వాత కాలంలో మూత పడటంతో అయన సినిమాలను నుంచి తప్పుకున్నారు.చివరి రోజుల్లో చిల్లి గవ్వ లేక బహుమానంగా వచ్చిన డబ్బు తో ఇల్లు కొనుక్కొని చివరి వరకు దాంట్లోనే జీవించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube