ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రైతుల దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.60 శాతానికి పైగా ధాన్యం అంతా పొలాల్లోనే ఉందన్న చంద్రబాబు రైతులను సీఎం, మంత్రులు ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు.గతంలో హుద్ హుద్ తుపాను సమయంలో తాను అహర్నిశలు పని చేసినట్లు చెప్పారు.
తుపాను వస్తే జగన్ అటువైపు కూడా చూడలేదని విమర్శించారు.







