మినుము పంటను సంవత్సరం పొడుగునా ఏ కాలంలోనైనా పండించవచ్చు.కానీ ఎక్కువగా వేసవిలో వరి కోతల తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో మినుము పంటను సాగు చేస్తున్నారు.
ఈ పంట సాగుకు చౌడు భూములు తప్ప, మిగిలిన అన్ని నేలలు అనుకూలంగానే ఉంటాయి.తొలకరి చినుకులు పడ్డాక గొర్రుతో భూమిని మెత్తగా తయారు చేయాలి తొలకరి చినుకుల తర్వాత అయితే జూన్ లేదా జూలై నెలలలో.
రబీలో అయితే అక్టోబర్ నెలలో.అదే మాగాణి లో అయితే మార్చి నెలలో విత్తుకోవాలి.
ఒక ఎకరం భూమిలో ఆరు కిలోల విత్తనాలు అవసరం.అదే మాగాణి లో అయితే 12 కిలోల విత్తనాలు అవసరం.ముందుగా విత్తనాలను 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మరియు 2.5 గ్రాముల థైరం తో విత్తన శుద్ధి చేయాలి.

ఒక ఎకరం భూమిలో 20 కిలోల నత్రజని( Nitrogen ), 50 కిలోల భాస్వరం( Phosphorus ) తోపాటు పశువుల ఎరువులు వేసి గొర్రుతో కలియదున్నాలి.అదే మాగాణి లో అయితే దాదాపుగా ఎరువుల అవసరం ఉండదు.ఇక పంట వేశాక రెండు లేదా మూడు తడులు పంటకు నీరు అందించవలసి ఉంటుంది.30 రోజులకు ఆ తర్వాత 55 రోజులకు నీటి తడులు అందించాలి.పంట వేసిన 30 రోజుల తర్వాత వాతావరణం లోని మార్పుల వల్ల లేత ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలు ఏర్పడి క్రమంగా పెరుగుతూ లేత కొమ్మలకు కాయలకు వ్యాపిస్తాయి.వీటిని బూడిద తెగులు( Gray rot ) అంటారు.
లీటరు నీటిలో ఒక గ్రాము కార్బండజిమ్ కలిపి మొక్కలు బాగా తడిచేలాగా 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

ఆకుమచ్చ తెగుల వ్యాప్తి ఎలా చెందుతుందంటే ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమరంగు మచ్చలు ఏర్పడి అవి పెద్దగా వలయాకారంగా ఏర్పడడంతో ఆకులు ఎండి రాలిపోతాయి.నీటిలో 2.5 గ్రాముల మాంకోజెబ్ ( Mancozeb )కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.పొలం నలువైపులా ఉండే గట్లపై కాస్త ఎక్కువగా పిచికారి చేస్తే తెగుల నుండి పంటను సంరక్షించుకోవచ్చు.







