పోలాండ్ దేశంలోని ఒరేగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అలెగ్జాండర్ విట్కోవ్‌స్కీ ఆధ్వర్యంలో డెర్మటాలజిస్టుల బృందం అరుదైన చర్మ క్యాన్సర్ ను గుర్తించింది.దానికి మెలనోమాగా ( Melanoma )నామకరణం చేసింది.
మొదట ఈ సమస్యను క్రిస్టీ స్టాట్స్ అనే మహిళ లో వైద్యులు గుర్తించారు.ఆమె కంటి కింద అనుమానాస్పదమైన ఎర్రటి మచ్చ( Red spot ) ఏర్పడడంతో డెర్మటాలజిస్ట్ ( Dermatologists )డాక్టర్ విట్కోవ్‌స్కీ సంప్రదించింది.
దాని పరీక్షించిన అతను 0.65 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న ఆ చిన్న మచ్చ దేనికి సంబంధించినదో అని అనేకసార్లు పరిశోధనలు చేశాడు.చివరగా మరికొందరు నిపుణులతో కలిసి దాన్ని అరుదైన మెలనోమాగా గుర్తించాడు.అది చిన్న సైజులో ఉంటుంది.కాబట్టి ఈ క్యాన్సర్ కారక మచ్చ వెంటనే కంటికి కనిపించదని ప్రత్యేకంగా మైక్రోస్కోప్ ద్వారా చూడాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.ఇది సూర్యుని ద్వారా విడుదలయ్యే అతినీలలోహిత కాంతి వల్ల సంభవించే ప్రాణాంతక చర్మ క్యాన్సర్ల( Skin cancers )లో ఒకటి అని కూడా తెలిపాడు.

ఇది చాతి, వీపు, మెడ, ముఖం వంటి భాగాల్లో ఎక్కడైనా కనిపించవచ్చని వెల్లడించారు.ఎన్నడూ లేని విధంగా శరీరంలో ఎర్రటి అతి చిన్న మచ్చలు కనిపించడమే ఈ వ్యాధి లక్షణం అని తెలిపారు.ఈ సంవత్సరం దాదాపు 97 వేలకు పైగా మెలనోమా క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అమెరికా క్యాన్సర్ సొసైటీ అంచనా వేసినట్లు సమాచారం.అయితే వివిధ చర్మ క్యాన్సర్లతో పోల్చినప్పుడు మెలనోమా కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఎదుర్కొనే అవకాశం ఉంది అని కూడా వైద్యులు చెబుతున్నారు.

ఈ క్యాన్సర్ కణాలు చర్మం బయట పొరల్లో ఏర్పడిన తొలి దశ లో గుర్తించినప్పుడు మాత్రమే చికిత్స ద్వారా నయం అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు.చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉందని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.







