Kajal Agarwal: ఆ స్టార్ హీరోతో కాజల్ ప్రేమాయణం.. అయినా కూడా తన భర్త సైలెంట్ గా ఎందుకున్నాడంటే?

ఏంటి హీరోయిన్ కాజల్ ( Kajal Agarwal ) ఒక స్టార్ హీరోతో ప్రేమలో ఉందా.అంతేకాకుండా అతనితో అంత క్లోజ్ గా కూడా మూవ్ అయ్యిందా అంటే అవునని అంటున్నారు కొందరు.

 Gautam Kitchlu Silent On Kajal Agarwal Love Track With Allu Arjun During Arya 2-TeluguStop.com

ఇక ఇంత రచ్చ జరుగుతున్న కూడా తన భర్త మాత్రం ఏమీ అనకుండా సైలెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది.భార్య గురించి అన్ని మాటలు వినిపిస్తుంటే కనీసం భర్త ఏమి స్పందించకపోయేసరికి కొందరు జనాలు అనుమానం పడుతున్నట్లు తెలుస్తుంది.

అయితే దీనికి కూడా ఒక కారణం ఉందని తెలిసింది.మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తన నటనతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కాజల్.ఆ తరువాత మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్ సరసన నటించింది.

ఇక ఈమెకు టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు.ఆ తరువాత చాలావరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

Telugu Allu Arjun, Arya, Gautam Kichlu, Gautam Kitchlu, Kajal Agarwal, Kajalagga

ఇక తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లు తో( Gautam Kitchlu ) కొంతకాలం రిలేషన్షిప్ లో ఉండి.అతడిని పెళ్లి చేసుకుంది.అప్పటి నుంచి ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా టూర్స్ ప్లాన్స్ వేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది.సంవత్సరం కిందట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.బాబు పుట్టాక కూడా కాజల్ అందంలో ఎటువంటి మార్పు లేదు.పైగా మునిపటి రూపం సంపాదించుకోవడం కోసం వర్కౌట్లు కూడా చేసింది.

అంతేకాకుండా సినిమాలలో అవకాశాలు రావటంతో కూడా సైన్ చేస్తుంది.

Telugu Allu Arjun, Arya, Gautam Kichlu, Gautam Kitchlu, Kajal Agarwal, Kajalagga

ప్రస్తుతం ఆమె ఓ సినిమాలో బిజీగా ఉంది.అయితే ఇదంతా పక్కన పెడితే కాజల్ గురించి ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది.ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ ఎటువంటి గాసిప్ లకు లొంగలేదు.

కానీ ఇప్పుడు ఈ బ్యూటీ గురించి ఒక వార్త వినిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.అయితే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో ఆర్య 2 సినిమాలో నటించినప్పుడు ప్రేమాయణం నడిపిందని.

అందుకే ఆ సినిమాలో లిప్ కిస్ కు కూడా ఒప్పుకుందని కొందరు నానా హంగామా చేశారు.

Telugu Allu Arjun, Arya, Gautam Kichlu, Gautam Kitchlu, Kajal Agarwal, Kajalagga

కానీ కొంతకాలం తర్వాత కాజల్ తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోగా అవన్నీ కేవలం పుకార్లే అని తెలిసిపోయింది.కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం మళ్లీ అదే విషయాన్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి రచ్చ చేస్తున్నట్లు తెలిసింది.అయితే ఈ విషయం గురించి అప్పట్లో కానీ ఇప్పుడు కాని కాజల్ స్పందించలేదు.

కనీసం తన భర్త గౌతం కూడా వార్తల గురించి కాజల్ ని ప్రశ్నించలేదని తెలుస్తుంది.అయితే దానికి కారణం ఒకటి ఉందని తెలుస్తుంది.అదేంటంటే సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు ఇటువంటి పుకార్లు రావడం కొత్తేమీ కాదు అనుకోని అతడు సైలెంట్ గా ఉన్నాడట.దీంతో కొందరు కాజల్ భర్త చాలా మంచి వాడని.

కాజల్ ను బాగా అర్థం చేసుకున్నాడని పొగుడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube