తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కరీంనగర్ జిల్లా చైతన్యపురిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం కేసీఆర్ నిధులు పంపుతున్నారని ఆరోపించారు.మిడ్ మానేరు నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు.వేములవాడకు రూ.500 కోట్లు ఇస్తామని ఇవ్వలేదని విమర్శించారు.రైతులకు నష్టపరిహారం రూ.10 వేలు కూడా ఇవ్వలేదన్నారు.హామీలు నెరవేర్చని కేసీఆర్ ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.







