గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు సక్సెస్ లను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.అందుకే ఫుల్ ఖుషీగా తన నెక్స్ట్ సినిమా భోళా శంకర్ ( Bhola Shankar ) ను పూర్తి చేస్తున్నాడు.
తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా నుండి షూట్ గురించి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.

ఇప్పటికే చాలా భాగం పూర్తి చేసుకోగా ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోల్ కత్తా లో జరగబోతుంది అని తెలుస్తుంది.రేపటి నుండి స్టార్ట్ కానున్న ఈ షెడ్యూల్ కోసం ఈ రోజే టీమ్ అంతా అక్కడికి చేరుకుంది.స్పెషల్ ఫ్లైట్ లో మెగాస్టార్, మెహర్ రమేష్ ( Meher Ramesh ) కోల్కతా చేరుకున్న పిక్స్ సోషల్ మీడియా లో ప్రత్యక్షం అయ్యాయి.దీంతో ఈ పిక్స్ మెగా ఫ్యాన్స్ లో మంచి వైరల్ అయ్యాయి.

ఇక ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ అంచనాలు బాగా నెలకొన్నాయి.అందుకే ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో అక్కినేని యువ హీరో సుశాంత్ కూడా కీలక రోల్ పోషిస్తున్నాడు.మరి ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇంకా సమయం చాలానే ఉండడంతో ఎప్పుడు షూట్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారో వేచి చూడాలి.







