కాపు ఉద్యమ నేత , మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) పొలిటికల్ కెరియర్ పై చాలాకాలంగా అనేక వార్తలు వస్తున్నాయ.ప్రత్యక్ష రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న ముద్రగడ 2014లో కాపు ఉద్యమాన్ని మొదలుపెట్టారు.
టిడిపి ప్రభుత్వం ఇస్తానన్న కాపు రిజర్వేషన్లను( Kapu Reservations ) అమలు చేయాలని కోరుతూ పెద్ద ఉద్యమమే నడిపారు.ఆ వ్యవహారంలో తునిలో రైలు తుని తగలబెట్టిన కేసులోనూ ముద్రగడ పేరు కూడా ఉంది . ఇటీవలే ఆ కేసును కోర్టు కొట్టివేయడం తో పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలని ముద్రగడ భావిస్తున్నారట.ఇప్పటికే ఆయనకు బిజెపి, వైసీపీ ల నుంచి ఆహ్వానాలు అందాయి.
అయితే ముద్రగడ మాత్రం వైసీపీలో ( YCP ) చేరితేనే రాజకీయంగా తనకు ప్రాధాన్యం ఉంటుందనే ఆలోచనతో ఉన్నారట.
అయితే సీటు విషయంలోనే ఆయన షరతులు పెట్టినట్లు తెలుస్తోంది.
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేకపోయినా, తన చిన్న కుమారుడు గిరిబాబుకు సీటు ఇవ్వాలనే డిమాండ్ ను ముద్రగడ పెట్టారట.అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తాను ఎన్నికల్లో పోటీ చేయడం కంటే తన కుమారుడుని పోటీకి దింపితే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారట.2009లో పిఠాపురంలో స్వల్ప ఓట్ల తేడాతో ముద్రగడ ఓటమి చెందారు.దీంతో తన కుమారుడు గిరిబాబును పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి దించే ఆలోచనలో ఉన్నారట.
అయితే ఈ సీటు విషయంలో స్పష్టమైన హామీ వైసీపీ ఇవ్వడం లేదట.దీనికి కారణం ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుండడం, రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఈ నియోజకవర్గంలోనే ఉండడంతో వైసిపి ఆలోచనలో పడిందట.ప్రస్తుతం ఇక్కడ నుంచి వైసీపీ సిట్టింగ్ ఎంపీగా పెండం దొరబాబు ఉన్నారు.గతంలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా వంగ గీత గెలిచారు.ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నారు.రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉండడంతో,
పవన్ ను ఎదుర్కోగల సమర్థవంతమైన అభ్యర్థి కోసం వైసిపి వెతుకుతోందట.పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత చరిష్మా ఉన్న అభ్యర్థిని పోటీకి దింపాలని చూస్తోందట.ఈ పరిస్థితుల దృష్ట్యా ముద్రగడ కుమారుడికి టికెట్ ఇచ్చే విషయంలో వైసిపి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతుందట.
అయితే సీటు విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత వైసీపీలో చేరాలని ఆలోచనతో ముద్రగడ ఉండగా, పిఠాపురం సీటు కాకపోయినా, ఏదో ఒక పదవి ఇచ్చి రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామని హామీ వైసీపీ నుంచి వస్తుండడం తో వైసీపీ వైపే ముద్రగడ మొగ్గు చూపిస్తున్నారట.