రాజ్ భవన్ కు ప్రగతి భవన్ దూరం అంటున్న గవర్నర్

గత కొంతకాలంగా ఎడ ముఖం పెడ ముఖం గా ఉంటూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి మరియు గవర్నర్ల వ్యవహార శైలి మరొకసారి చర్చనీయాంశంగా మారింది .ప్రపంచ రాజకీయ చరిత్రలో తెలంగాణ ముఖచిత్రాన్ని సగర్వంగా ప్రకటించుకునే విధంగా తెలంగాణ సచివాలయం( Telangana Secreteriat ) నిర్మించామని, అత్యాధునికతను సంప్రదాయాన్ని మిల్లితం చేస్తూ నిర్మించిన ఈ సచివాలయం తరాలు పాటు కేసీఆర్ను గుర్తుంచుకునేలా చేస్తుందంటూ గులాబీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి .

 Kcr Not Invited Governor Tamilisai For Secretariat Opening Details, Kcr, Telanga-TeluguStop.com

అయితే ఇంత ఘనంగా నిర్మించిన ఈ సచివాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ని( Governor Tamilisai ) ఆహ్వానించలేదు అన్న విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది .

Telugu Cm Kcr, Pragathi Bhawan, Raj Bhawan, Ts-Telugu Political News

కేంద్రంతో సరైన సంబంధాలు లేని నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడే గవర్నర్ కూడా తమ ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టాలని చూస్తుందని ముఖ్యమైన ఫైళ్లను ఆమోదించకుండా శాసన వ్యవస్థకు తగిన గౌరవం ఇవ్వడం లేదని గవర్నర్ పై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే .కోర్టుల జోక్యంతో పరిస్థితి కొంత సద్దుమనిగినట్లు కనిపించినప్పటికీ అత్యంత ప్రత్యేకమైన ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ఫస్ట్ లేడిని పిలవకపోవడం అధికార పార్టీ తప్పే అని వార్తలు వస్తున్నాయి.

Telugu Cm Kcr, Pragathi Bhawan, Raj Bhawan, Ts-Telugu Political News

హైదరాబాదులో ఏర్పాటు చేసిన జి – 20 సమావేశాల లో పాల్గొన్న గవర్నర్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేశారు… సచివాలయ ప్రారంభానికి తనుకు ఆహ్వానం రాలేదని దేశాధి నేతల నైనా కలవవచ్చును కానీ ఈ రాష్ట్ర చీఫ్ ను కలవలేమంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు తన పట్ల మొదటి నుంచి ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ ను పాటించడం లేదని అయితే తాను మర్యాదల కోసం ఎదురుచూసే మనిషిని కాదని ప్రజల కోసం పనిచేసే మనిషిని అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆమె ఈ సందర్భంగా చెప్పుకోచ్చారు.అయితే ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ తెలంగాణ చరిత్రలో ప్రత్యేక అధ్యయంగా నిలిచే ఇలాంటి చారిత్రక సందర్భంలో రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో అత్యున్నత స్థానమైన గవర్నర్ కి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోవడం కెసిఆర్ సర్కార్( KCR ) చేసిన తప్పే అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube