టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మన్మధుడు నాగార్జున తనయుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.హీరో నాగార్జున( Nagarjuna ) విషయానికి వస్తే.60 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్ల కుర్రాడిలాగే కనిపిస్తూ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తున్నారు నాగార్జున.ఈ వయసులో కూడా అంతే అందాన్ని మెయింటైన్ చేస్తూ మన్మధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.మరి అలాంటిది తండ్రి నాగార్జున పోలికలు ఎక్కడికి పోతాయి.

ప్రస్తుతం జూనియర్ మన్మధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అక్కినేని నాగచైతన్య( Akkineni Naga Chaitanya ).ఈ మధ్యకాలంలో నాగచైతన్యకు వయసు పెరిగే కొద్దీ అందం మరింత రెట్టింపు అవుతోంది.రోజు రోజుకి మరింత హ్యాండ్సమ్ గా తయారవుతున్నారు నాగచైతన్య.అదేంటో కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో సంతోషంగా ఉన్నప్పటి కంటే ఆమెతో విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత నాగచైతన్య మరింత హ్యాండ్సమ్ గా మారడం ఆశ్చర్యపోవాల్సిన విషయం.
ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న నాగచైతన్య అందం మరింత రెట్టింపు అవుతుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.నాగచైతన్య లో అందం రెట్టింపు అయిందని మాట్లాడుకుంటున్నారు.ఈ మధ్యకాలంలో నాగచైతన్య ఫోటోలు చూస్తే ఈ వార్తలు నిజమే అని అనిపిస్తుంది.వయసు పెరిగే కొద్దీ అందంలో తండ్రిని మించి పోతున్నాడు నాగచైతన్య.
తన అందం విషయంలో కనిపించడంతోపాటు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు నాగచైతన్య.ఇకపోతే చైతన్య సినిమాల విషయానికి వస్తే.

నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం కస్టడీ( Custody ).ఈ సినిమాకు వెంకట ప్రభు ( Venkata Prabhu )దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇందులో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ పాత్రలో కనిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.







