సమంత గొప్ప నటి... ఆమెతో నటించడం గర్వంగా ఉంది.. ధనుష్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్( Danush ) ప్రస్తుతం తెలుగులో కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించి ఇక్కడ కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు.నటుడిగా తెలుగు తమిళ భాషలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన తాజాగా సార్ సినిమా( Sir Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన హిట్ అందుకున్నారు.

 Samantha Is A Great Actress Proud To Act With Her Dhanushs Comments Are Viral, D-TeluguStop.com

ప్రస్తుతం ధనుష్ తన తదుపరిచిత్రం కెప్టెన్ మిల్లర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ధనుష్‌ రీసెంట్‌ బ్రేక్ సెషన్‌లో అభిమానులతో ముచ్చటించారు.ఇందులో అభిమానులు అడిగి ఎన్నో రకాల ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్పారు.ఇలా అభిమానులతో ముచ్చటిస్తున్నటువంటి ఈయనకు మీ ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు ధనుష్ ఏ మాత్రం ఆలోచించకుండా తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అంటే ఇష్టమని తెలిపారు.అయితే గతంలో కూడా ఈయన పవన్ కళ్యాణ్ పేరు చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగడంతో ఈయన చాలా తెలివిగా సమాధానం చెప్పారు.తనకు అజిత్( Ajith ), విజయ్( Vijay ) ఇద్దరు ఇష్టమైననీ తెలిపారు.ఇంకా గట్టిగా మాట్లాడితే తాను రజనీకాంత్ పేరు చెప్పేస్తానని ధనుష్ వెల్లడించారు.ఇలా హీరోల గురించి మాత్రమే కాకుండా ఈయన హీరోయిన్ సమంత ( Samantha ) గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సమంత ఎంతో అద్భుతమైన నటి అని, ఆమెతో కలిసి నటించడం నిజంగా నాకు గర్వంగా ఉంది అంటూ ఈ సందర్భంగా ధనుష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube