బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయాలని గతేడాది ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కానీ తన ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీపీకి మరోసారి దరఖాస్తు ఇచ్చినట్లు వెల్లడించారు.







