ప్రతిరోజు పావురాలకు గింజలు వేస్తున్నారా.. అయితే ఈ వ్యాధి రావడం పక్కా.. జాగ్రత్తగా ఉండకపోతే..!

పావురల పై మీకున్న ప్రేమ నెమ్మదిగా మీ ఊపిరితిత్తులను దెబ్బతిస్తుంది అంటే మీరు నమ్మగలరా.! పావురాలు వేసే రెట్టల వల్ల మీకు శ్వాసకోశ వైఫల్యం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

 Do You Give Seeds To The Pigeons Every Day.. But This Disease Is Sure To Come..-TeluguStop.com

నిపుణులు అభిప్రాయం ప్రకారం పావురాల వల్ల ఊపిరితిత్తుల వ్యాధి కేసులు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి.పక్షులు లేదా పావురాలకు ( Pigeons )గింజలు వేసేవారు వాటి సమీపంలో ఎక్కువగా ఉంటారు.

ఈ కారణంగా వారిలో ఆస్తమా వ్యాధులు పెరిగిపోతున్నాయి.పావురాల రెట్టల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే పలు నగరాల్లో పోస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Telugu Tips, Lung, Seeds, Thane-Telugu Health Tips

ప్రతిరోజు పావురాలకు గింజలు వేసే వారి ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.దేశంలోనే మొదటిసారిగా థానే మున్సిపాలిటీ ( Thane Municipal Corporation )పావురాలకు గింజలు వేస్తే 500 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు పోస్టర్ల ద్వారా హెచ్చరించింది.పావురాల ఈకల ద్వారా శ్వాసకోశ వ్యాధుల ప్రభావం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.పక్షి రెట్టలు, ఈకల నుంచి ఉత్పత్తి చేయబడిన ఇన్హేల్డ్ యాంటిజెన్లు ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి.

Telugu Tips, Lung, Seeds, Thane-Telugu Health Tips

ఇవి ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి. ఊపిరి ఆడక పోవడం, పొడి దగ్గు, ఛాతి బిగుతుగా ఉండడం, చలి, అలసట, తీవ్ర జ్వరం, దీర్ఘకాలిక దగ్గు, ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం( Weight loss ) అలాంటివి ఉంటాయి.ఇలాంటి లక్షణాలు ఎక్కువ రోజులు కనిపిస్తే మాత్రం వైద్యులను సంప్రదించడమే మంచిది.

Telugu Tips, Lung, Seeds, Thane-Telugu Health Tips

ఈ వ్యాధికి సంబంధించిన నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మీ ఇంటి చుట్టూ పావురాలు ఉన్న సమయంలో మాస్కు ధరించడం ఎంతో మంచిది.హ్యూమిడిఫైయర్‌లు, హాట్ టబ్‌లు , హీటింగ్ , కూలింగ్ సిస్టమ్‌లను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.అలాగే పక్షి ఈకలతో నిండిన పరుపులను కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.

మీ పెంపుడు జంతువు నివసించే ప్రాంతాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube