పత్తి పంట సాగులో ఆకుమచ్చ తెగులు నివారణకు సస్యరక్షణ పద్ధతులు..!

పత్తి( Cotton )ని తెల్ల బంగారం అని పిలుస్తారు.భారతదేశంలోని సాగు విస్తీర్ణంలో పత్తి పంట సాగు 14% మేర ఆక్రమించింది.

 Plant Protection Methods For The Prevention Of Leaf Spot Pests In Cotton Cultiva-TeluguStop.com

పత్తి పంటను తెగుల బారిన పడకుండా సంరక్షించుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.పత్తి పంట సాగుకు నీరు నిలువ ఉండని నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

వేసవిలో లోతు దుక్కులు దున్ని, రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులకు( Organic fertilizers ) అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.ఇక జీవన ఎరువులను సరిపడే క్రమంలో పంటకు అందించడం వలన మొక్కలు సమృద్ధిగా పెరిగి, ఆరోగ్యవంతంగా ఉంటాయి.

Telugu Agriculture, Cotton, Formers, Latest Telugu, Potassium-Latest News - Telu

నేలలో ఎటువంటి పంటలు పండించిన విత్తన శుద్ధి మాత్రం తప్పనిసరి.విత్తన శుద్ధి చేస్తే భూమిలో ఉండే క్రిమి కీటకాల వల్ల ఎటువంటి హాని సంభవించదు.పత్తి పంట వేశాక 20 రోజులకు ఒకసారి కచ్చితంగా నీటి తడులు అందించాలి.ఎరువులు వేసినప్పుడు, పత్తి మొక్కకు పూత వస్తున్న సమయంలో, మొక్కకు లేత కాయలు ఉన్న సందర్భంలో ఖచ్చితంగా నీటి తడులు అందించాలి.

Telugu Agriculture, Cotton, Formers, Latest Telugu, Potassium-Latest News - Telu

పత్తి పంటను ఆకుమచ్చ తెగుల నుండి సంరక్షించుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.ఆకు మచ్చ తెగులను ఎలా గుర్తించాలో.? ఎలా నివారించాలో పూర్తిగా తెలుసుకుందాం.పత్తి మొక్క ఆకుల మధ్యలో గోధుమ రంగు మచ్చలు వలయాకారపు రింగుల వలె ఏర్పడితే వాటిని ఆకుమచ్చ తెగులుగా నిర్ధారించుకోవచ్చు.

తర్వాత ఆకులపై ముదురు గోధుమ రంగు లో గుండ్రని మచ్చలు ఏర్పడి మధ్యభాగం తెల్లగా తయారవుతుంది.తొలి దశలోనే వీటిని గుర్తించి మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఐదు రోజుల వ్యవధిలో రెండు లేదా మూడుసార్లు మొక్క బాగా తడిసినట్టు పిచికారి చేయడం వల్ల ఈ ఆకుమచ్చ తెగులను నివారించవచ్చు.

Telugu Agriculture, Cotton, Formers, Latest Telugu, Potassium-Latest News - Telu

అయితే ఈ ఆకు మచ్చ తెగులు మొక్కలో నత్రజని, పొటాషియం( Potassium ), బాస్వరం పోషక పదార్థాల లోపం వల్ల ఏర్పడతాయి.ఒకవేళ ఆకుమచ్చ తెగుల వ్యాప్తి అధికంగా ఉంటే ఒక శాతం మెగ్నీషియం సల్ఫేట్ తో పాటు రెండు గ్రాముల యూరియా ను లీటర్ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసి ఈ తెగులను అరికట్టుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube