టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఢీలా పడిపోయాడు.ఇటీవల వచ్చిన ది ఘోస్ట్( The Ghost ) సినిమా కూడా నిరాశ పరిచిన విషయం తెలిసిందే.ఆ సినిమా ఖచ్చితంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుందని అంతా ఆశించారు.కానీ ఐదు కోట్ల ను కూడా రాబట్టలేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల టాక్.ఆ సినిమా విషయం పక్కన పెడితే నాగార్జున ప్రస్తుతం రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ( Prasanna kumar ) దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్నాడు.
ధమాకా తో పాటు పలు సినిమాలకు రచయితగా వ్యవహరించిన ప్రసన్న కుమార్ బెజవాడ నాగార్జున సినిమా తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

వరుసగా ఫ్లాప్స్ పడుతున్న ఈ సమయం లో నాగార్జున కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాగార్జున( Nagarjuna ) తీసుకున్న నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.ఈ సమయంలో ప్రయోగాలు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో నాగార్జున చేస్తున్న చిత్రం ఒక సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ అనే విషయం గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది.ఇప్పటి వరకు ఆ విషయంలో క్లారిటీ రాలేదు.సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లుగా కూడా ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు.కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ను అక్టోబర్ లేదా నవంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు గాను దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ ప్రయత్నాలు చేస్తున్నాడని.
షూటింగ్ ఇప్పటికే 30% పూర్తయిందని సమాచారం అందుతోంది.

నాగార్జున కి భారీ అంచనాల నడుమ వచ్చిన సినిమాలు నిరాశ పరుచుతున్నాయి.అందుకే ఈ సినిమాను ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల చేయాలని భావిస్తున్నారట.అతి త్వరలోనే సినిమా కు సంబంధించిన టైటిల్ ని ప్రకటించి నాగార్జున యొక్క లుక్ రివిల్ చేసే అవకాశం ఉంది.
ఈ సినిమాలో అఖిల్ లేదా నాగచైతన్య చిన్న గెస్ట్ రోల్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.







