సాధారణంగా పిల్లలకు పేర్లు ( Names ) పెట్టాలంటే సవాలక్ష విషయాలను పరిగణలోకి తీసుకుంటారు.వారు పుట్టిన తేదీ, సమయం, తిది అంటూ ఎన్నో ఉంటాయి.
ఇది కొంతమంది తూచా తప్పకుండ ఫాలో అవుతున్నారు.ఇక మరికొంత మంది అయితే పేరులో ఏముంది లెండి వారు ఆరోగ్యంగా ఉండి, అదృష్టం బాగుంటే అన్ని వాటంతట అవే బాగుంటాయి అని అనుకుంటారు.
ఎవరి నమ్మకాలు వారివి .అయితే ఈ రెండు వర్గాలు కాకుండా మూడో వర్గం ఉంటుంది.వారు ఎలా ఉంటారు అంటే సమాజం కోసం ఉద్యమాలు చేస్తూ సంఘం బాగు కోసం వారి భవిష్యత్తు కోసం ఎదో ఒకటి చేస్తూ ఉంటారు.
అలాంటి వారిలో గోరా – సరస్వతి దంపతులు( Gora Saraswati ) ఒకరు.
గోపరాజు రామచంద్రారావు( Goparaju Ramachandra Rao ) గోరా అంటూ పిలుస్తారు.ఈ దంపతులు జీవితం అంత హేతువాద ఉద్యమం కోసం బ్రతికాడు.
సమాజంలో కులం ఉండకూడదు అని, మూఢనమ్మకాలకు వ్యతరేఖంగా పోరాడారు.జోగిని లాంటి వ్యవస్థలు అంతరించి పోవాలని పోరాటాలు చేసారు.
అయితే వీరు తొమ్మిది మంది పిల్లలకు జన్మ ఇవ్వగా వారి పేర్లు మాత్రం వారి ఆలోచనల మాదిరి చాల భిన్నంగా ఉన్నాయి.ఆ తొమ్మిది మంది పేర్లు ఇలా ఉన్నాయి.

1.మనొరమ,2.లవణం,3.మైత్రి,4.విద్య,5.విజయం,6.సమరం,7.నియంత,8.మారు,9.నౌ.వీరిలో సమరం గారు వైద్య నిపుణులుగా మన అందరికి పరిచయమే.నాలుగో సంతానం విద్య విజయవాడ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు.
రెండవ సంతానం లవణం గాంధీజీ ఆశ్రమంలొ గుర్రం జాషువా కుమార్తె హేమలత ని వివాహం చేసుకున్నారు.ఇక గోరా గారి పరిచయంతో అంటరానితనం నిర్ములన కోసం పాటు పడ్డారు గురువులు గారు.
అలాగే పల్నాడును దాటి రాష్ట్రం మొత్తం గురువులు తిరిగారు.

అయన తన పిల్లలకు చాల గమ్మత్తు గా పేర్లు పెట్టారు.మొదటి కుమారుడు జన్మించెప్ప్పటికీ అయన చాల హుషారుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు.అందుకే అతడికి హుషార్ అని, పల్నాడులో అంబర్ చరఖా ప్రవేశ పెడుతుంటే పుట్టిన రెండో సంతానంగా కి అంబర్ అని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయంలో పుట్టిన మూడో సంతానం కి ఆంధ్రరాష్ట్రం అని, నాగార్జునాన్ సాగర్ శంకుస్థాపన సమయంలో పుట్టిన నాలుగో సంతానంకి నాగార్జునా సాగర్ అని, తాను వేప నూనె వ్యాపారంలో ఉన్నానని చివరి సంతానం కి నీమ్ అని పేర్లు పెట్టారు.







