రాంగ్ నెంబర్ కి పొరపాటున రీఛార్జ్ చేస్తే.. డబ్బు తిరిగి ఎలా పొందాలంటే..?

గతంలో అయితే రీఛార్జ్( Recharge ) కోసం టాప్ అప్ కార్డులు కొనేవాళ్లం.టెక్నాలజీ( Technology ) అభివృద్ధి చెందడంతో ఇంటర్నెట్ సహాయంతో ఇంట్లో కూర్చొని సులభంగా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది.

 If You Recharge By Mistake To A Wrong Number How To Get The Money Back , Money B-TeluguStop.com

అనేకమంది ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి యాప్లను ఉపయోగించి మొబైల్ ఫోన్ కు రీఛార్జ్ చేసుకుంటున్నారు.ఈ క్రమంలో కొంతమంది పొరపాటున రాంగ్ నెంబర్ కి రీఛార్జ్ చేసి ఇబ్బందులు పడుతున్నారు.

తక్కువ మొత్తంలో అయితే పరవాలేదు కానీ ఎక్కువ మొత్తంలో వేరే నెంబర్ కు పొరపాటున రీఛార్జ్ చేస్తే ఎవరికైనా బాధే అనిపిస్తుంది.ఒకవేళ రాంగ్ నెంబర్ వ్యక్తులకు ఫోన్ చేసి విషయం వివరిస్తే వాళ్లు తిరిగి మన డబ్బులు చెల్లిస్తారో చెల్లించారో తెలియదు.

కానీ రాంగ్ నెంబర్ కు( Wrong number ) రీఛార్జ్ చేసి తిరిగి డబ్బులు ఎలా పొందాలో చాలామందికి తెలియదు అది ఎలాగో చూద్దాం.

Telugu Latest Telugu-Technology Telugu

ఒకవేళ రాంగ్ నెంబర్ కు రీఛార్జ్ చేస్తే సంబంధిత కంపెనీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపవచ్చు.భారతదేశంలో జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు.కాబట్టి సంబంధిత కంపెనీ ఈమెయిల్ ఐడిని సులభంగా పొందవచ్చు.

ఆ ఈమెయిల్ ఐడి ద్వారా కంపెనీకి స్పష్టమైన సమాచారం అందించాలి.అయితే టెలికాం కంపెనీలు కస్టమర్ల ఫిర్యాదును అంగీకరించవు.

పైగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన మాత్రం శూన్యం.కొన్నిసార్లు ఏకంగా ఫోన్ కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉండదు.

కాబట్టి ఫిర్యాదును టెలికాం కంపెనీ పట్టించుకోక పోయినప్పటికీ.కస్టమర్ కేర్ పోర్టల్ లో రిపోర్ట్ చేయవచ్చు.

వాట్సప్ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు.మరొక అవకాశం ఏందంటే గూగుల్ ప్లే స్టోర్ లో కస్టమర్ సర్వీస్ పోర్టల్ యాప్( Customer Service Portal App ) ను డౌన్లోడ్ చేసి దాని ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

Telugu Latest Telugu-Technology Telugu

ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.రాంగ్ నెంబర్ కు రీఛార్జ్ చేసిన వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలి.ఇక మరొక విషయం మీ నెంబర్ కు రాంగ్ నెంబర్ కు 1 లేదా 2 నెంబర్ల తేడా మాత్రమే ఉండాలి.అప్పుడే తిరిగి డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.

అలా కాకుండా ఫోన్ నెంబర్ మొత్తం భిన్నంగా ఉంటే కంపెనీ తిరిగి డబ్బులు చెల్లించదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube