Adah Sharma : ది కేరళ స్టోరీ వివాదంపై స్పందించిన ఆదా శర్మ.. ఎజెండా ఫిలిం కాదంటూ?

ఆదా శర్మ( Adah Sharma ) ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ది కేరళ స్టోరీ( The Kerala Story ).ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు.

 Actress Adah Sharma Strong Counter On The Kerala Story Movie Called A Propagand-TeluguStop.com

విపుల్ అమృత్ షా( Vipul Amrit Shah ) ఈ సినిమాను నిర్మించారు.మే 5న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

హిందీలో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది.ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది.కేరళకు చెందిన దాదాపు.32 వేల మంది మహిళలు ఉగ్రవాదులుగా మార్చబడుతున్నారు అన్న కథాంశంతో ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.కాగా గత పన్నెండేళ్లలో కేరళ రాష్ట్రంలో చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్‌కు గురయ్యారని, దాదాపు 32వేల మంది యువతులను అపహరించారని, వారు ఉగ్రవాదులుగా మారుతున్నారని, వారి చర్యలకు బలవుతున్నారని పేర్కొంటూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Telugu Adah Sharma, Propaganda, Stroung Counter, Kerala Story-Movie

దాంతో ఈ సినిమా దుమారం రేపడంతో పాటుగా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్ గా కూడా నిలుస్తోంది.ఇదొక ప్రొపగండా ఫిల్మ్( A propaganda film ) గా వర్ణిస్తున్నారు.కేరళా సీఎం పినరయి విజయన్‌ తో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఇతర సామాజిక సంస్థలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆదా శర్మ ఈ విషయంపై స్పందించింది.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కాసేపు అభిమానులతో ముచ్చటించిన ఆమె అభిమానులు అడిగే ఎన్నో ప్రశ్నలకు ఓపికగా నవ్వుతూ సమాధానం ఇచ్చింది.ఈ క్రమంలోనే ఆమె ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోని కూడా షేర్ చేసింది.

ఆ వీడియోలో ఆదా శర్మ మాట్లాడుతూ.ఈ సినిమా ఏ మతానికి వ్యతిరేకం కాదని, కానీ కచ్చితంగా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకమైనది అని ఆమె తెలిపింది.

అమ్మాయిలు మత్తు మందులకు, బ్రెయిన్‌ వాష్‌కి, అత్యాచారానికి గురి కావడం, మానవ అక్రమ రవాణా, బలవంతంగా గర్భం దాల్చేలా చేయడం వంటి అంశాలను గురించి ఉంటుందని ఆమె తెలిపింది.

Telugu Adah Sharma, Propaganda, Stroung Counter, Kerala Story-Movie

అంతేకాకుండా గర్బిని మహిళలు ప్రసవించిన తర్వాత తల్లుల నుంచి బిడ్డని వేరు చేసి, వారిని ఆత్మాహుతి బాంబర్లుగా తయారు చేస్తున్నారనే విషయాలను తెలిపే చిత్రమే ది కేరళ స్టోరీ అని తెలిపింది ఆదాశర్మ.ఈ సినిమాని రాజకీయ ఏజెండా, ప్రచారం కోసం తీసిన చిత్రంగా పిలిచినప్పుడు, అది కేవలం టాపిక్‌ని డైవర్ట్ చేసే ప్రక్రియ అవుతుందని, లేదంటే సమస్యని చిన్న విషయంగా చేసే చర్య అవుతుందని ఈ సినిమా జీవితం, మరణం గురించి ఉంటుంది.కాబట్టి ఈ సినిమాతో మేము అన్ని కులాల, మతాల, వర్గాల అమ్మాయిలకు అవగాహన కల్పించగలమని నమ్ముతున్నాము.

అయినప్పటికీ కొందరు ఇదొక ఏజెండా ఫిల్మ్ గా చెబితే, మే 5న సినిమా చూస్తే వారికి నిజాలేంటో అర్థమవుతాయి.సినిమా చూశాక వారి మైండ్‌ సెట్ కూడా మారుతుందని అనిపిస్తోంది అని తెలిపింది ఆదాశర్మ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube