ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.చాలా మంది తమ బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.
అయితే తమ పెళ్ళిలో అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.మీరు కూడా త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ని అస్సలు మిస్ అవ్వకండి.ఈ రెమెడీ మీకు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.
సహజంగానే మిమ్మల్ని అందంగా మెరిపిస్తుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక టమాటో ను కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు, టమాటో( Tomato ) ముక్కలు మరియు రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకోవాలి.అలాగే కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ పెరుగు,( Curd ) పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

పెళ్లికి కొద్దిరోజుల ముందు నుంచి ఈ రెమెడీని పాటిస్తే చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి.చర్మం ఆరోగ్యంగా( Skin care ), నిగారింపుగా మెరుస్తుంది.మొటిమలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చర్మం టైట్ గా మారుతుంది.
సహజంగానే అందంగా ఆకర్షణీయంగా మెరుస్తారు.మీ పెళ్లిలో మీరే స్పెషల్ అట్రాక్షన్ అవుతారు.







