కారు ఉన్న నా పిల్లలను స్కూల్ బస్సులోనే పంపుతాను: గోపీచంద్

సినిమా ఇడస్ట్రీలో నటుడుగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదిచుకున్న నటుడు గోపీచంద్(Gopichnd) ప్రస్తుతం రామబాణం (Ramabanam) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా మే 5 వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 I Send My Children In School Bus Hero Gopichand Comments Details, ,sriwaas,gopic-TeluguStop.com

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ తన పర్సనల్ విషయాలను తెలియ చేశాడు.గోపీచంద్ కి ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే.

అయితే తన పిల్లల గురించి గోపీచంద్ ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన పిల్లల గురించి మాట్లాడుతూ….తన వద్ద డబ్బు ఉన్నా పిల్లలకి ఎక్కువ డబ్బు ఇవ్వను .అలాగే కారు ఉన్నా కూడా పిల్లలను స్కూల్ బస్(School Bus) లోనే స్కూల్ కి పంపిస్తాను అంటూ తెలిపారు.ఇలా చేయడం వల్ల వారికి అన్ని విషయాలు తెలుస్తాయి.అందరితో కలుస్తారు.అందుకే వారిని కార్లలో స్కూల్ కి తీసుకెళ్ళను అంటూ గోపీచంద్ తన పిల్లల పెంపకం గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పిల్లల పెంపకం గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవడంతో పలువురు నెటిజన్స్ ఈ వ్యాకల పై స్పందిస్తూ పిల్లలను ఎప్పుడు కూడా ఇలానే పెంచాలి.వారికి ప్రతి దాని విలువ తెలిసినప్పుడే వారి జీవితం బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక గోపీచంద్ డైరెక్టర్ టి.కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక ఈయన తాజాగా శ్రీవాస్(Sriwaas) దరశకత్వంలో రాబోతున్న రామా బాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube