రాజమౌళి ( Rajamouli )తర్వాత తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని మరింత పెంచే డైరెక్టర్ ఎవరంటే అందరు సుకుమార్( Sukumar ) పేరే చెబుతారు.ఆయన కూడా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు.
పుష్ప 1 తో పాన్ ఇండియా షేక్ చేసిన సుక్కు పార్ట్ 2 తో కూడా అంతకుమించి రిజల్ట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ ప్రభాస్ తో ఒక భారీ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.
ఇది అటు ఇటుగా బిఫోర్ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో రాజుల పాలనలో కథ ఉంటుందని తెలుస్తుంది.
పీరియాడికల్ డ్రామాలో రాజమౌళి లానే సుక్కు కూడా తన మార్క్ చూపిస్తున్నాడు.ప్రభాస్( Prabhas ) సినిమాను సుకుమార్ పీరియాడికల్ డ్రామాగా స్వాతంత్రం రాక ముందు పరిస్థితుల గురించి.రజాకారుల పాలన గురించి ప్రస్థావిస్తారని తెలుస్తుంది.
ప్రభాస్ ఆల్రెడీ బాహుబలిలో రాజు పాత్రలో నటించాడు.మరి సుకుమార్ సినిమాలో ఎలా కనిపిస్తాడో చూడాలి.
ట్రిపుల్ ఆర్ కూడా స్వాతంత్రం రాకముందు కథతోనే వచ్చి హిట్ కొట్టాడు జక్కన్న.ఇప్పుడు ప్రభాస్ తో కూడా అలాంటి కథతో సుకుమార్ మూవీ చేస్తాడని తెలుస్తుంది.
ఈ సినిమా దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిచబోతున్నారని టాక్.