Pooja Hegde : ఖరీదైన లగ్జరీ కారును వదిలేసి ఆటోలో ప్రయాణించిన బుట్టబొమ్మ.. ఏమైందంటే?

మామూలుగా కొన్ని కొన్ని సార్లు సెలబ్రెటీలు సరదా కోసం తమ లగ్జరీ కార్లు( Luxury Cars )వదిలి బైకులపై, ఆటోలలో ప్రయాణిస్తూ ఉంటారు.లగ్జరీ కార్లు ఉన్నా కూడా అలా సామాన్య వ్యక్తులులాగా ప్రయాణించటం చూడముచ్చటగా అనిపిస్తుంది.

 Actress Pooja Hegde Srilanka Trip Photos Viral Social Media-TeluguStop.com

ఇప్పుడు అటువంటిదే టాలీవుడ్ బుట్ట బొమ్మ కూడా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.టాలీవుడ్ బుట్ట బొమ్మ అంటే వెంటనే గుర్తుకొచ్చే బ్యూటీ పూజా హెగ్డే.

ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.ఇక అలా వైకుంఠపురం( Ala Vaikunthapurramuloo )లో సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమాతోనే బుట్ట బొమ్మగా నిలిచింది.ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా తన సోషల్ మీడియా( Social Media ) వేదికగా ఒక ఫోటో షేర్ చేసుకోగా అందులో తను ఆటోలో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది.

అయితే తను ప్రస్తుతం శ్రీలంక ట్రిప్( Srilanka Trip ) లో ఉన్నట్టు తెలుస్తుంది.ఈ సందర్భంగా ఆమె అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు చూడటం కోసం ఎటువంటి ఏసీ కారు బుక్ చేసుకోకుండా కేవలం చిన్న ఆటో ద్వారా ప్రయాణిస్తూ కనిపించింది.

ఇక అందులో తను క్యూట్ గా నవ్వుతూ కనిపించింది.ఆ ఫోటో చూసిన జనాలు ఆమె ఆటో( Pooja Hegde in Auto )లో ప్రయాణించడానికి చూసి మురిసిపోతున్నారు.ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే.మహేష్ బాబు తో ఓ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉంది.ఇక పవన్ కళ్యాణ్ తో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ లో అవకాశాలు అందుకున్నట్లు వార్తలయితే వినిపించాయి.బాలీవుడ్ లో ఓ సినిమాలో నటించగా ఆ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube