ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.రైతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశామని తెలిపారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొట్టు వెల్లడించారు.రైతులకు నష్టం లేకుండా ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
ఆఫ్ లైన్ లో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారన్న ఆయన పరిశీలించి రేపటి నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని తెలిపారు.ఈ మేరకు పది లక్షల గన్నీ బ్యాగ్స్ పంపిణీ చేశామని పేర్కొన్నారు.







