నగరాలలో ఎలక్ట్రిక్ కార్లే ముద్దు.. పెట్రోల్, డీజిల్ కార్లు వద్దంట..ఎందుకో తెలుసా..?

హైదరాబాద్ వంటి నగరాలలో ట్రాఫిక్ కారణంగా కార్లలో ప్రయాణించేవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.ఇక సాయంత్రం వేళలో ఒక కిలోమీటర్ కారులో ప్రయాణం చేయాలంటే గంటల తరబడి ట్రాఫిక్ లో ఆగిపోవాల్సిందే.

 Electric Cars Are Best In Cities Than Petrol Diesel Cars Details, Electric Cars-TeluguStop.com

కాబట్టి నగర పరిధిలో కార్ డ్రైవింగ్ చేసే వారికి నైపుణ్యంతో పాటు కాస్త ఓపిక, సహనం ఉండాలి.

అంతేకాకుండా ఒకపక్క పెట్రోల్, డీజిల్ ధరలు( Petrol Diesel Cars ) ఆకాశాన్ని అంటుతుంటే.

మరొకపక్క ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఇంధనం వృథా గా ఖర్చు అవుతుంది.అయితే ఇంధన ఇంజన్లతో కూడిన కారులు హైవేలపై, ఓపెన్ రోడ్లపై అయితే మంచి మైలేజ్ అందిస్తాయి.

కానీ నగర పరిధిలో మాత్రం సమయంతో పాటు ఇంధనం ( Fuel ) కూడా వృథాగా ఖర్చు అవుతుంది.

Telugu Electric Car, Electric Cars, Fuel, Hyderabad-Latest News - Telugu

అదే ఎలక్ట్రిక్ కార్ల( Electric Cars ) విషయానికొస్తే నగర పరిధిలో అధిక పనితీరును కనబరుస్తుంది.ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ బాగానే ఉంది.అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ కార్ల వల్ల ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు కూడా ఉన్నాయి.

కానీ నగర పరిధిలో ప్రయాణించాలంటే ఎలక్ట్రిక్ కార్లే బెస్ట్ అంటున్నారు నిపుణులు.అది ఎలాగో చూద్దాం.

అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఇంధన కార్లలో గేర్లు, బ్రేకులు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత తక్కువ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు మైలేజీ తగ్గిపోతుంది.హైదరాబాద్ వంటి నగరాలలో ఎక్కువసార్లు గేర్లు మారుస్తూనే ఉండాలి.అలాగే బ్రేకులు కూడా ఎక్కువసార్లు వినియోగించాల్సి ఉంటుంది.కాబట్టి మైలేజ్ తగ్గడంతో పాటు పనితీరు కూడా తగ్గుతుంది.

Telugu Electric Car, Electric Cars, Fuel, Hyderabad-Latest News - Telugu

ఎలక్ట్రిక్ కారులో రీజనరేటింగ్ బ్రేకింగ్ ఉంటుంది.నగర పరిధిలో ఎన్నిసార్లు బ్రేక్ వేస్తే అన్నిసార్లు బ్యాటరీ రీఛార్జ్ అవుతూనే ఉంది.నగరంలో ట్రాఫిక్, సిగ్నల్ లైట్ల కారణంగా ఒక కిలోమీటర్ పరిధిలోనే ఎన్నోసార్లు బ్రేకులు వేయాల్సి ఉంటుంది.దీంతో ఆటోమేటిగ్గా బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది.పైగా ఎలక్ట్రిక్ కార్లలో గేర్ బాక్స్ ఉండదు కాబట్టి డ్రైవింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube