తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ప్రస్తుతం ఆ పార్టీలో ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే.రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి ప్రధాన కారణం బండి సంజయే అని కమలం పార్టీ అధిష్టానం గట్టిగా నమ్ముతోంది.
అందుకే ఆయనకు అన్నీ విషయాల్లోనూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అధిష్టానం.అయితే కొన్ని సందర్భాల్లో బండి చేసే వ్యాఖ్యలు బీజేపీ( BJP )కి తీవ్ తలనొప్పులుగా మారుతూ ఉంటాయి.
మసీదులు తవ్వుతామని మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరిచేలా మాట్లాడడం బండి ప్రసంగాలలో చాలానే చూశాం.దాంతో బండికి షార్ట్ టెంపర్ ఎక్కువని, అవగాహనతో మాట్లాడారని, రాజకీయ పరిజ్ఞానం తక్కువ అని ఇలా ఎన్నో రకాల విమర్శలు అటు ప్రజల నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తూనే ఉంటాయి.

ఇక బీజేపీ ప్రత్యర్థి పార్టీ బిఆర్‌ఎస్ నేతలు బండి సంజయ్ వ్యాఖ్యలను ఎండగట్టిన సంబర్భాలు చాలా ఉన్నాయి.ఇలా అవగాహనలోపం తో బండి చేసే వ్యాఖ్యలు బీజేపీకి వచ్చే మైలేజ్ ను తగ్గిస్తున్నాయనేది కొందరి అభిప్రాయం.ఆ మద్య ఎమ్మెల్సీ కవితా విషయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులు కొని తెచ్చుకున్నారు.ఇప్పుతూ తాజాగా నూతన సచివాలయం విషయంలో కూడా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో బండి సంజయ్ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతోందనేది కొందరి అభిప్రాయం.

తెలంగాణ సిఎం కేసిఆర్( CM KCR ) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన సచివాలయం( New Secretariat ) నిన్న ప్రారంభం జరుపుకున్న సంగతి తెలిసిందే.అయితే సచివాలయం తాజ్ మహల్ ను పోలివుందని, కేవలం ముస్లింల కొరకే సచివాలయం కేసిఆర్ నిర్మించారని ఇందులో హిందువులకు వాటా లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

అంతే కాకుండా తాము అధికారంలోకి వస్తే సచివాలయంలో మార్పులు చేస్తాం అంటూ కూడా వ్యాఖ్యానించారు.అయితే కులమతలకు అతీతంగా ఉండే సచివాలయం విషయంలో మతప్రస్తావనను తీసుకురావడంపై బండి సంజయ్ పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు బిఆర్‌ఎస్ నేతలు.అయితే మరోవైపు నూతన సచివాలయం అన్నీ వైపులా నుంచి సానుకూల స్పందన వస్తున్నప్పటికి.బీజేపీ మాత్రం అందులో కూడా నెగిటివిటీ చూస్తుండడం గమనార్హం.
అయితే సచివాలయానికి మొదట 600 కోట్లు అంచనా వేసిన కేసిఆర్ పూర్తి అయిన తరువాత 1600 కోట్లు ఖర్చు అయినట్లు చెబుతున్నారని బండి విమర్శిచారు.అయితే ఇలాంటి ఆరోపణలు నేతల మద్య సాధారణమే అయినప్పటికి సచివాలయం విషయంలో మతప్రతిపాధికనా వ్యాఖ్యానించడంపై బండి సంజయ్ తీరును తప్పుబడుతున్నారు చాలమంది.







