తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుష్క(Anushka) ప్రభాస్ (Prabhas)జోడికి ఎలాంటి క్రేజ్ మనకు తెలిసిందే.వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి.
అలాగే వీరిద్దరే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ కావడంతో ఈ జోడీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా వీరిద్దరూ కూడా రిలేషన్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలు నిజమయి నిజజీవితంలో కూడా వీరిద్దరూ ఒక్కటైతే బాగుంటుందని ప్రభాస్ అనుష్క అభిమానులు భావించారు.
అయితే అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, కేవలం మంచి స్నేహబంధం మాత్రమే ఉందని ప్రభాస్ అనుష్క ఆ వార్తలను ఖండించారు.

ఇలా తమ మధ్య కేవలం స్నేహబంధం మాత్రమే ఉందని చెప్పినప్పటికీ ప్రభాస్ అనుష్క జోడి గురించి ఇప్పటికి ఈ వార్తలు వినపడుతూనే ఉంటాయి.ఇక ప్రభాస్ అనుష్క ఇద్దరు బాహుబలి(Bahubali) సినిమాలో చివరిగా నటించారు.ఈ సినిమా తర్వాత అనుష్క కూడా పెద్దగా సినిమాలలో నటించలేదు అయితే తాజాగా ఈమె నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.ఇక ఈ సినిమా టీజర్ ను నటుడు ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ టీజర్ ప్రమోషన్ చేశారు.

ఇలా ప్రభాస్ తన సినిమా టీజర్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేయడంతో అనుష్క ప్రభాస్ స్టోరీని షేర్ చేస్తూ థాంక్యూ పప్సు అని చెప్పుకొచ్చారు.ఇలా అనుష్క పప్సు అని చెప్పడంతో ఇది ప్రభాస్ ముద్దు పేరు అయ్యుంటుందని అందుకే అనుష్క ఇలా తన నిక్ నేమ్(Nick Name) తో తనకు స్పెషల్ థాంక్స్ చెప్పారు అంటూ ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.ప్రభాస్ నిక్ నేమ్ ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఇలా ఎవరికీ తెలియని సీక్రెట్ అనుష్క బయట పెట్టడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







