సుకుమార్( Sukumar ) శిష్యుడు అయిన బుచ్చిబాబు( Buchi Babu ) ఈ మధ్య కాలంలో మోస్ట్ వాంటెడ్ దర్శకుడుగా మారాడు.ఆయన మొదటి సినిమా ఉప్పెన తో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా తర్వాత వెంటనే ఎన్టీఆర్ నుండి పిలుపు దక్కించుకున్న విషయం తెల్సిందే.కానీ వారి కాంబో వర్కౌట్ కాలేదు.
దాంతో చాలా నెలల సమయం బుచ్చి బాబుకి వృధా అయ్యింది.ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అంటే చాలా నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుందని భావించి మరో హీరో తో కమిట్ అవ్వాలి అనుకున్నాడు.
ఈ మధ్య రామ్ చరణ్( Ram Charan ) కి కథ చెప్పి ఒప్పించి సినిమా ని చేసేందుకు రెడీ అవుతున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరుగితే జూన్ లేదా జూలై నెలలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఉప్పెన ( Uppena )చిత్రం విడుదలయ్యి చాలా కాలం అవుతుంది.కానీ తదుపరి సినిమా ప్రారంభం కి చాలా సమయం వచ్చింది.ఈ గ్యాప్ లో బుచ్చిబాబు ఒక సినిమాను చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం బుచ్చిబాబు చేస్తున్న సినిమాల సంఖ్య ఒకే ఒక్కటి.
అది కూడా రామ్ చరణ్ తో.అది ప్రారంభం అవ్వడానికి ఇంకా కొన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉంది.100 కోట్ల సినిమా ను చేసిన బుచ్చిబాబు ఇలా స్లోగా సినిమాలు చేస్తే పరిస్థితి ఏంటి అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.రాంచరణ్ సినిమా కి ముందే ఒక సినిమా చేసి ఉంటే బాగుండేది కదా అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది కాలం లో బుచ్చి బాబు తీవ్రంగా నిరాశ పర్చాడు.ఎందుకంటే రామ్ చరణ్ సినిమా ప్రకటన వచ్చిన తర్వాత కూడా బుచ్చి బాబు సమయం వృదా చేస్తున్నాడు.
చరణ్ తో బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవ్వడానికి చాలా సమయం పడుతుందట.త్వరలోనే బుచ్చిబాబు చరణ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది.







