ఏప్రిల్‌ నెలలో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీగా విదేశీ పెట్టుబడులు!

మోడీ( Narendra Modi ) నాయకత్వాన దేశం దేదీప్యమానంగా వెలిగిపోతుందని విశ్లేషకుల అంచనా.ఇక దానికి తగ్గట్టే దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు రోజురోజుకీ పెరిగిపోతుండటం గమనార్హం.

 Huge Foreign Investments In Domestic Equity Markets In The Month Of April April-TeluguStop.com

ఇవి దేశానికి అత్యంత సానుకూలంగా మారుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) భారత మార్కెట్లలోకి రూ.11,630 కోట్ల నిధులను పెట్టారని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

ప్రముఖ కంపెనీల షేర్లు అనేవి ఆకర్షించే ధరల్లో ఉండటం, రూపాయి మారకం విలువ బాగా పుంజుకోవడం వంటి తాజా పరిణామాలతో ఎఫ్‌పీఐల సెంటిమెంట్ బాగా బలపడిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.దానికి ముందు మార్చి నెలకు సంబందించి ఎఫ్‌పీఐలు రూ.7,936 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన సంగతి విదితమే.

అయితే, అదే సమయంలో దేశీయ అదానీ గ్రూప్( Adani Group ) కంపెనీల్లోకి అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్‌నర్స్ పెట్టుబడులు సహకరించాయి.జీక్యూజీ పార్ట్‌నర్స్( GQG Partners ) పెట్టుబడులు మినహాయిస్తే ఆ నెలలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు ప్రతికూలంగా ఉన్నట్టు స్పష్టమౌతోంది.

ఇకపోతే, ఈ వారంలో జరిగే అమెరికా ఫెడ్ సమావేశంలో మరొకసారి వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.ఈ నేపథ్యంలో, ఎఫ్‌పీఐల విషయంలో కొంత అప్ అండ్ డౌన్ జరగొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.ఏదిఏమైనా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్ సానుకూలంగా ఉండటంతో ఎఫ్‌పీఐలు మన మార్కెట్లలో పెట్టుబడులను ఇంకా కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నారు.ఇదేగాని జరిగితే ఇండియన్ బిజినెస్ మార్కెట్లో పెను మార్పులు జరుగుతాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube