'మే'నెల నుండి రాబోతున్న మార్పులు ఇవే... ఏటీఎం నుంచి జీఎస్టీ వరకు!

ఏప్రిల్ నెల విజయవంతంగా ముగిసింది.దాంతో ఇప్పుడు చాలామంది మే మాసంలో( May ) ఎలాంటి మార్పులు రాబోతున్నాయనే విషయంపైన దృష్టిని కేంద్రీకరించారు.

 Financial Rule Changes From May Gst Mutual Funds Lpg Price And More Details, May-TeluguStop.com

ఈ క్రమంలో సామాన్యుల జోబులకు చిల్లు పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.మొదటగా చెప్పుకోవాలంటే ఈ మే ఒకటో తారీఖు నుంచి జీఎస్టీ( GST ) నిబంధనల్లో పెను మార్పులు రానున్నాయి.ఇకపై కొత్త నిబంధన ప్రకారం రూ.100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు లావాదేవీకి సంబంధించిన రసీదులను 7 రోజుల్లోగా ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో అప్‌లోడ్ చేయాల్సిందే.

ఇక మే 1 నుంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు( Mutual Fund ) పెట్టుబడిదారుల కేవైసీతో కూడిన ఈ-వాలెట్ల ద్వారా మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సి ఉంటుంది.కాదంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.దీనికి సంబంధించి సెబీ( SEBI ) ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.అన్నింటి కన్నా ఎక్కువ మంది ప్రజలు ఎదురుచూసే అంశం గ్యాస్ ధరలు.

ప్రతి నెల మెుదటి తేదీన చమురు కంపెనీలు ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ రేట్లను ప్రకటిస్తాయి.అయితే ఈ రేట్ల మార్పుల్లో పెద్దగా మార్పులు కనబడడం లేదు.

ఆ తరువాత చాలా కాలంగా డొమెస్టిక్ వినియోగదారులు ధరల తగ్గింపు కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.కానీ ఇవి కూడా తగ్గుముఖం పట్టడం కష్టం.చివరిగా బ్యాంకింగ్ రంగం విషయానికొస్తే, మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ అయితే ఈ వార్త ఖచ్చితంగా తెలుసుకోండి.కస్టమర్లు మే 1 నుంచి వారి ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసి లావాదేవీ విఫలమైతే వారిపై రుసుము వసూలు చేయాలని బ్యాంక్ నిర్ణయించడం ఇపుడు హాట్ టాపిక్ అయింది.ఇందుకోసం రూ.10తో పాటు జీఎస్టీని వసూలు చేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించడం కొసమెరుపు.

New Rules From May 1st

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube