ఏపీలో పాగా వేసేందుకు ఎప్పటి నుంచో బీఆర్ఎస్ ( BRS )ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమించారు.
మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు, ఏపీలోను తమ పార్టీకి మంచి ఆదరణ ఉంటుందనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారు.ఇప్పటికే మహారాష్ట్రలో మూడుసార్లు బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహించారు.
ఇదే మాదిరిగా ఏపీలోనూ బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను నిర్వహించే ప్లాన్ లో కేసీఆర్ ( KCR )ఉన్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో తమ పార్టీకి ఆదరణ ఎక్కువగా ఉంటుందని, తెలంగాణలోనూ ఉత్తరాంధ్ర( Uttarandhra ) ప్రాంతానికి చెందినవారు ఎక్కువమంది ఉన్నారని, ఆ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్పష్టంగా ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

అందుకే బీఆర్ఎస్ మొదటి సభను విశాఖలోనే నిర్వహించే ప్లాన్ లో ఉన్నారు.ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) విషయంలో బీఆర్ఎస్ కలుగజేసుకుంది.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పింది.
దీంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమకు అవకాశం ఎక్కువగా ఉంటుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు ఉండడంతో, అన్ని స్థానాల్లోనూ పోటీ చేసే ఆలోచనలు ఆ పార్టీ ఉంది.ఇదే విషయాన్ని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ కూడా ప్రకటించారు.విశాఖ సభ సక్సెస్ అయితే విజయవాడ , రాయలసీమ ప్రాంతాల్లోనూ భారీగా బీఆర్ఎస్ సభలను నిర్వహించి రాబోయే ఎన్నికల నాటికి ఏపీలో బలమైన శక్తిగా ఎదగాలనే పట్టుదలతో కెసిఆర్ ఉన్నారు.
ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ఏపీలో బహిరంగ సభ నిర్వహించే ఆలోచనతో ఉన్నారట.ఈ సభకు భారీగా జన సమీకరణ చేపట్టే బాధ్యతలను ఏపీ బీఆర్ ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు అప్పగించారట.







