సాధారణంగా స్టార్ హీరోలు, యంగ్ హీరోలు సక్సెస్ ఇచ్చిన దర్శకులను మాత్రమే నమ్ముతారనే సంగతి తెల్సిందే.అయితే కొన్నిసార్లు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్లు కొంతమంది హీరోలకు భారీ డిజాస్టర్లు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు.
స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్( VV Vinayak ) అఖిల్ తో తెరకెక్కించిన “అఖిల్” మూవీ, సాయిధరమ్ తేజ్ తో తెరకెక్కించిన “ఇంటెలిజెంట్” మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచి వినాయక్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి.
సురేందర్ రెడ్డి( Surender Reddy ) రవితేజతో తెరకెక్కించిన కిక్2, అఖిల్ తో తెరకెక్కించిన ఏజెంట్ సినిమాలు దారుణమైన ఫలితాలను అందుకున్నాయి.
ఈ రెండు సినిమాలకు వక్కంతం వంశీ కథా రచయితగా వ్యవహరించారు.సుకుమార్( Sukumar ) మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన్ 1 నేనొక్కడినే సినిమా సైతం డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.
శ్రీను వైట్ల( Srinu Vaitla ) మహేష్ తో తెరకెక్కించిన ఆగడు, చరణ్ తో తెరకెక్కించిన బ్రూస్ లీ, వరుణ్ తేజ్ తో తెరకెక్కించిన మిష్టర్, రవితేజతో తెరకెక్కించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.

గుణశేఖర్ విషయానికి వస్తే రవితేజతో తీసిన నిప్పు, సమంతతో తీసిన శాకుంతలం ఫ్లాపులుగా నిలిచాయి.పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్నారు.గత కొన్నేళ్లలో పూరీ తీసిన సినిమాలలో కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.
క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, కొండపొలం సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.

పవన్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసి కూడా డిజాస్టర్ గా నిలిచింది.హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన లై, పడి పడి లేచే మనసు డిజాస్టర్లుగా నిలిచాయి.విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన థాంక్యూ సినిమా ఆయన ఫ్యాన్స్ కు సైతం నచ్చలేదు.
ఆచార్య సినిమాతో కొరటాల శివ చిరు, చరణ్ లకు ఫ్లాప్ ఇవ్వగా వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలతో ఇంద్రగంటి మోహనకృష్ణ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నారు.

బోయపాటి శ్రీను ఖాతాలో సైతం వినయ విధేయ రామ అనే డిజాస్టర్ ఉంది.రామయ్యా వస్తావయ్యా సినిమాతో హరీష్ శంకర్, రభస మూవీతో సంతోష్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ షాకులిచ్చారు.గోపీచంద్ మలినేని విన్నర్ మూవీతో, బాబీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలతో భారీ ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నారు.
పక్కా కమర్షియల్ సినిమాతో మారుతి ఖాతాలో కూడా భారీ ఫ్లాప్ చేరింది.రాజమౌళి, అనిల్ రావిపూడి మాత్రమే వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.







