కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసుపై గుజరాత్ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.
సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీని ఆదేశించింది.
అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.అయితే పీఎం మోదీ ఇంటి పేరుకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా కేసు వేసిన సంగతి తెలిసిందే.







