టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈమెపై ఉన్నటువంటి అభిమానాన్ని సందీప్(Sandeep) అనే వ్యక్తి వినూత్న రీతిలో చూపించారు.
బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన సమంత అభిమాని సందీప్ సమంతకు వీరాభిమాని ఈ క్రమంలోనే సమంత కోసం ఏకంగా ఈయన తన ఇంటి ఆవరణంలో గుడి(Temple) కట్టించి తన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈయన చేసిన పని కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.

ఇక సమంత ఏప్రిల్ 28వ తేదీ పుట్టిన రోజు జరుపుకున్న నేపథ్యంలో సందీప్ ఈ గుడిని ప్రారంభించి గ్రామ ప్రజలందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసి ఆమె పుట్టినరోజు సందర్భంగా కేక్ కూడా కట్ చేశారు.ఇలా సమంత పై ఉన్నటువంటి అభిమానాన్ని సందీప్ ఇలా చాటుకోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సందీప్ సమంత గుడి నిర్మించడం కోసం ఎంత మేర ఖర్చు చేశారనే విషయాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం సందీప్ సమంత కోసం గుడి కట్టడానికి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది.ఇలా హీరోయిన్ పట్ల అభిమానంతో ఈయన ఇంత మొత్తంలో ఖర్చుచేసి గుడి కట్టించారని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే సందీప్ సమంతను ఇంతలా అభిమానించడానికి ఓ కారణముందట సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహించడమే కాకుండా ఎంతోమందిని తన ఫౌండేషన్ ద్వారా ఆదుకుంటూ అండగా నిలిచారు.
తద్వారా సమంతకు సందీప్ వీరాభిమానిగా మారిపోయారని తెలుస్తుంది.







