సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)తాజాగా ఎన్టీఆర్(NTR) శతజయంతి దినోత్సవాల్లో భాగంగా విజయవాడలో జరిగిన బహిరంగ సభలో ఈయన ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రజనీకాంత్ ఎన్టీఆర్ గురించి, తాను సినిమాలలోకి రావడానికి ఎన్టీఆర్ ఎంతలా ప్రభావం చూపించారనే విషయాలను వెల్లడించారు.
తాను మొదటిసారి నటించిన చిత్రం బైరవి అయితే ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తాను ఈ సినిమాలో హీరోగా నటించానని రజనీకాంత్ వెల్లడించారు.అలాగే ఎన్టీఆర్ దుర్యోధనుడి పాత్ర చూసి చాలా ఆశ్చర్యపోయారని తనపై ఎన్టీఆర్ ప్రభావం చాలా ఉందని రజనీకాంత్ వెల్లడించారు.
ఇక తాను బస్ కండక్టర్ గా ఉన్న సమయంలో అక్కడ జరిగిన కొన్ని నాటకాలలో తాను దుర్యోధనుడు పాత్రలో( Duryodhana Role ) నటించానని అచ్చం ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటూ ఆయనలా నటించానని తెలియజేశారు.అది చూసిన నా స్నేహితులు నువ్వు కూడా సినిమాలలోకి వెళితే బాగుంటుందని తనని ప్రోత్సహించారు.ఇక ఎన్టీఆర్ నటించిన దాన వీరసూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ లాగా ఉండాలని ఆయనలా గెటప్ వేసుకొని ఫోటో దిగి నా స్నేహితులకు పంపించాను.అది చూసిన నా స్నేహితులు అచ్చం కోతి లాగా ఉన్నావు అంటూ నన్ను కామెంట్ చేశారని ఈ సందర్భంగా రజనీకాంత్ గుర్తు చేసుకుంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక ఎన్టీఆర్ గారు నటనపరంగా ఎంతో అద్భుతమైన నటులు అని చెప్పాలి ఆయన సినిమాలను చూస్తూ పెరిగానని, తాను ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్టీఆర్ గారు స్ఫూర్తి అని తెలిపారు.ఆయనలా క్రమశిక్షణతో కలిగి ఉండడం, నిర్మాతలను గౌరవించడం క్రమశిక్షణతో షూటింగ్ కి రావడం వంటివన్నీ ఎన్టీఆర్ గారి నుంచి నేర్చుకున్నానని తెలిపారు.తాను ఎన్టీఆర్ తో కలిసి రెండు చిత్రాల్లో నటించినట్లు రజినీ కాంత్ తెలిపారు.అందులో ఒకటి తెలుగు చిత్రం టైగర్ అని రెండోది మణ్ణన్ వాణి (నిండు మనిషి) అనే తమిళ సినిమా అని వివరించారు.