వైరల్: బుజ్జి కోడిపిల్ల నిల్చొని ఎలా నిద్రపోతుందో చూడండి... నవ్వులే నవ్వులు!

నిద్ర ( Sleep ) మనిషికేకాదు, ఈ భువిపైన పుట్టిన ప్రతి ప్రాణికి విశ్రాంతి అనేది చాలా అవసరం.సరిపడినంతగా నిద్ర లేకపోతే మరుసటి రోజు పనిచేయడం కష్టం.

 See How The Chick Sleeps While Standing Funny Video Viral Details, Chicken, Chic-TeluguStop.com

బ్రెయిన్ అయితే ఇక నావల్ల కాదు అని మొరాయిస్తుంది.దాంతో మనకి మరోలోకంలో ఉన్నట్టు మైకంగా ఉంటుంది.

అయితే అలా రాత్రిళ్ళు నిద్ర లేక పగలు ఎవరైనా నిద్ర మత్తలో తల అటుఇటు ఊపుతూ ఉంటే చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది.ముఖ్యంగా చిన్నపిల్లలు అలా చేసినపుడు చాలా నవ్వు కలిగిస్తుంది.అయితే అదే ఒక కోడిపిల్ల( Chicken ) అయితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి?

ఆ ఆలోచనే మనకు నవ్వు తెప్పిస్తుంది కదూ.అవును, అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) తెగ హల్ చల్ చేస్తోంది.ఓ చిన్న కోడిపిల్ల నిద్రకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు పిచ్చపిచ్చగా నవ్వేసుకుంటున్నారు.దాంతో కొందరు నెటిజన్లు తమ కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాన్ని రకరకాలుగా తెలియజేస్తున్నారు.

ఈ వీడియోని గమనిస్తే చాలా కోడి పిల్లలు అక్కడ కనిపిస్తున్నాయి.అవన్నీ తమ తమ పనులలో బిజీగా ఉండగా.

ఓ చిన్న కోడిపిల్ల మాత్రం నిలబడి నిద్రమత్తులో అటుఇటు తులతూగుతోంది.

అక్కడితో ఆగకుండా తన తలను నేలకు ఆనించి మరీ పడుకుని ఉండిపోయింది.ఈ దృశ్యం చూడడానికి రెండుకళ్ళూ సరిపోవడం లేదని కొంతమంది యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.కాగా దీనికి సంబంధించిన దృశ్యాలను కెమెరాలో బంధించిన హఫ్సా సలీమ్ అనే ఇన్‌స్టా యూజర్ తన ఖాతాలోనే షేర్ చేయగా ఇది చాలామందికి రీచ్ అయింది.

ఇంకేముంది కట్ చేస్తే చాలామంది నెటిజన్లు దానిని చూసి తగ సంబరపడిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube