మన పాలకుల కన్నా కేఏ పాల్ మిన్న

ప్రజలను పిచ్చివాళ్లను చేసే నాయకుల కన్నా,పిచ్చివాడైపోయిన నాయకుడు వల్ల ప్రజలకు జరిగే నష్టం తక్కువ.ఇప్పుడు కేఏ పాల్ వ్యవహారం ఆ విషయాన్ని నిరూపిస్తున్నట్లుగా తెలుస్తుంది ….

 K. A. Paul Has Good Appulause For Case On Vizag Steel Plant Issue , K. A. Paul-TeluguStop.com

సగటు రాజకీయాలలో కేఏ పాల్ అతిశయోక్తి తో కూడిన మాటలు విన్నవారికి ఆయన పిచ్చివాడేమో అన్న అనుమానం కూడా వస్తుంది …… తాను తలుచుకుంటే అమెరికా అధ్యక్షుడు తో కూడా ఐదు నిమిషాల్లో మాట్లాడగలనంటూ , .కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తానంటూ ఆయన మాట్లాడే మాటలు చాలామందికి కామెడీగా కనిపిస్థాయి .అయితే కేఏ పాల్ గత చరిత్ర తెలిసిన వారికి ఆయన వైభవాన్ని దగ్గరుండి చూసిన వారికి ఆయన ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధతో గుండె మేలి తిరుగుతుంది .

Telugu Ap, Paul, Chandrababu, Vizag Steel, Ys Jagan-Telugu Political News

ఒకప్పుడు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగన .క్రైస్తవ మత ప్రచారకుడుగా ప్రపంచ శాంతి కోసం పాటుపడిన దార్శనీకుడిగా వందల దేశాలు తిరిగి శాంతి ప్రవచనాలు ప్రచారం చేసిన ఘన కీర్తి కేఏ పాల్( K.A.Paul ) సొంతం ….ఆయనకు ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ కూడా ఉండేదంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు .

Telugu Ap, Paul, Chandrababu, Vizag Steel, Ys Jagan-Telugu Political News

వేల కోట్ల నిధులను ప్రపంచ దేశాల నుంచి తీసుకొచ్చిన చరిత్ర కూడా కేఏ పాల్కు ఉంది అయితే రకరకాల రాజకీయ కారణాలు వ్యక్తిగత కారణాలతో ఆయన గత కీర్తి అంత మసకబారిపోయి ఇప్పుడు ఆయన ఒక సాధారణ కమేడియన్ గా దేశ రాజకీయాల్లో మిగిలిపోవడం శోచనీయం.అయినప్పటికీ అధికార ప్రతిపక్షాలు( YCP )) చూసి చూడనట్టుగా పోతున్న విశాఖ ఉక్కు( Vizag Steel Plant ) విషయం మీద ఆయన కోర్టును ఆశ్రయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది .

Telugu Ap, Paul, Chandrababu, Vizag Steel, Ys Jagan-Telugu Political News

.చాలామంది రాజకీయ నాయకులు కన్నా బాధ్యతగల రాజకీయం పాల్ చేశారంటూ చాలామంది ఆయనను సోషల్ మీడియా వేదికగా పొగుడుతున్నారు .కోర్టు కూడా ఆయన పిటిషన్ను విచారణకు స్వీకరించింది.అయితే అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని సాదారణ పని వేళల్లో విచారణ చేస్తామని తెలిపింది ఏది ఏమైన ప్పటికీ తన చర్యల ద్వారా రాష్ట్రానికి కావలసింది తనలాంటి నిఖార్సైన నాయకులే తప్ప ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ నాయకులు కాదని ఒక హెచ్చరిక చేసినట్లుగా కేఏ పాల్ వ్యవహారం ఉందని సామాన్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube