అఖిల్ ఏజెంట్ సినిమాకు బెస్ట్ విషెస్ చెప్పిన నాగార్జున.. పోస్ట్ వైరల్!

అక్కినేని అఖిల్( Akkineni Akhil ) తాజాగా నటించిన చిత్రం ఏజెంట్( Agent ) .సురేందర్ రెడ్డి ( Surender Reddy )దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

 Nagarjuna Said Best Wishes For Akhil Agent Movie ,nagarjuna , Surender Reddy , A-TeluguStop.com

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక అఖిల్ కెరియర్ లో ఈ సినిమా ఎంతో ముఖ్యమైనదని చెప్పాలి.

ఇప్పటివరకు అఖిల్ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అఖిల్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.అఖిల్ సైతం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుస్తుంది.

ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి( Mammootty ) కూడా కీలక పాత్రలో నటించారు.

అఖిల్ ఏజెంట్ సినిమా గురించి నటుడు నాగార్జున ( Nagarjuna ) చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.నా కుమారుడివి అలాగే యంగ్ కొలీగ్ అయినా అఖిల్ నువ్వు కెరియర్ పరంగా చూసిన ఎత్తు పల్లాలు నాకు తెలుసు అలాగే ఈ సినిమా కోసం నువ్వు పడిన కష్టం, ఒక మంచి సినిమాని అందించాలని ఏజెంట్ మూవీ కోసం పడిన శ్రమ వృధా కాదని నా నమ్మకం తప్పకుండా ఈ సినిమాతో కెరీర్ లో మంచి సక్సెస్ సాధిస్తావ్ అంటూ ఈయన ఆకాంక్షించారు.అలాగే సినిమా కోసం కష్టపడిన చిత్ర బృందానికి ఈయన బెస్ట్ విషెస్ తెలియ చేశారు.

ఇక సురేందర్ రెడ్డి ( Surender Reddy )దర్శకత్వంలో యాక్షన్ స్పై త్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇక కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.ఇక ఈ చిత్రాన్ని దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో అనిల్ సుంకర నిర్మించారు.అయితే ఈ సినిమా నిర్మాణంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి హీరో అఖిల్ భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి సాక్షి వైద్య( Sakshi Vaidya ) అనే హీరోయిన్ పరిచయమయ్యారు.ఇక అఖిల్ కి ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube