అల్లరి నరేష్( Allari Naresh ), మిర్నా మీనన్ ( Mirna Menon )జంటగా నాంది( Nandi ) లాంటి హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కనకమేడల( Vijay Kanakamedala ) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉగ్రం ( Ugram ).ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే అల్లరి నరేష్ ప్రస్తుతం భయంకరమైన సినిమాలను చేస్తూ తనలో మరో యాంగిల్ కూడా ఉందని నిరూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఉగ్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా మే 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి మిర్నా మీనన్ ( Mirna Menon )ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆమె ఇదివరకు తెలుగులో క్రేజీ ఫెలో సినిమాలో నటించానని తిరిగి ఉగ్రం సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తెలియజేశారు.ఇక ఈ సినిమాలో నటించడం తనకు ఒక ఛాలెంజింగ్ అనిపించిందని మిర్నా మీనన్ పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో తన పాత్ర ఏకంగా మూడు షేడ్స్ లో కనపడబోతుందని తెలిపారు.ఒక కాలేజీ స్టూడెంట్ లాగా గృహిణిగా ఓ బిడ్డకు తల్లి పాత్రలో కూడా తను కనిపించబోతున్నానని వెల్లడించారు.
ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాగా ఇందులో ఒక కారు యాక్సిడెంట్ జరిగినట్టు చూపించారు.ఇక ఈ ప్రమాదం గురించి మిర్నా మీనన్ మాట్లాడుతూ… ఇది నిజంగానే చేసామని ఎలాంటి డూప్స్ లేకుండా నేను నరేష్ గారు ఈ సీన్ లో చేశామని మిర్నా తెలియజేశారు.అయితే ఈ సన్నివేశం షూట్ చేసే సమయంలో తాను ఎంతో భయపడ్డానని అయితే నరేష్ గారికి గాయాలు కూడా అయ్యాయని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇలా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డామంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక తన తదుపరి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తమిళం మలయాళం లో సినిమాలు చేస్తున్నానని వీటితో పాటు రజనీకాంత్ గారు నటిస్తున్న జైలర్ సినిమాలో కూడా ఓ పాత్రలో నటిస్తున్నానని మిర్నా మీనన్ ఈ సందర్భంగా తెలియజేశారు.