1995లో విడుదలైన బొంబాయి సినిమా( Bombay movie ) గురించి మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో అరవింద స్వామి, మనీషా కొయిరాలా ( Aravinda Swamy, Manisha Koirala )ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ మణిరత్నం ( Director Mani Ratnam )దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఏఆర్ రెహమాన్( AR Rahman ) ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.మరి ముఖ్యంగా ఈ సినిమాలోని “ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు”… అంటూ విరహవేదనతో ప్రేయసి కోసం వానలో తడుస్తూ హీరో పాట పాడుతూ ఉంటాడు.

ఈ పాట ఇప్పటికీ కూడా ఎవరి గ్రీన్ అని చెప్పవచ్చు.అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది.అయితే ఈ సినిమాలో ఫస్ట్ ఛాయిస్ అరవింద్ స్వామి కాదట.మరి ఇంత మంచి సినిమాను మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బొంబాయి సినిమాను మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో కాదు చియాన్ విక్రమ్( chiyaan vikram ).తమిళం, తెలుగులో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విక్రమ్ ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్ ఈ విషయాన్ని బయటపెట్టారు.

బొంబాయి సినిమాలో హీరో పాత్రకు ముందుగా హీరోగా నన్నే అనుకున్నారు.అందుకు సంబంధించి ఫోటో షూట్ కూడా జరిగింది.ఇక అదే రోజు సాయంత్రం మనీషా కోయిరాలా తో షూట్ జరిగింది.ఈ సినిమా కోసం నన్ను గడ్డం తీసేయమని డైరెక్టర్ మునిరత్నం చెప్పారు.కానీ నేను అప్పటికే ఒక సినిమా చేస్తున్నాను.ఆ సినిమాలో హీరో పాత్రకు గడ్డం తప్పనిసరిగా ఉండాలి.
దాంతో నేను ఆ సినిమా నుంచి అయిష్టంగానే తప్పుకున్నాను అని చెప్పుకొచ్చారు విక్రమ్.అయితే ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ నేను బాధపడుతుంటాను అని తెలిపారు విక్రమ్.
ఇకపోతే మామూలుగా మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ప్రతి ఒక్క నటుడు అనుకుంటూ ఉంటారు.అలా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన బొంబాయి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.
ఆ సినిమాతో హీరో అరవింద్ స్వామి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.







