టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఐశ్వర్య రాయ్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం.
దాదాపు 19 ఏళ్ల క్రితమే ఈమె మిస్ వరల్డ్ కిరీటాన్నీ కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఐశ్వర్య కు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
మరి ముఖ్యంగా ఐశ్వర్యారాయ్ అందానికి ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే.వయసు పెరుగుతున్నకొద్దీ తన అందాన్ని మరింత రెట్టింపుచేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.
ఐశ్వర్యారాయ్ అంటే ఉత్తరాదిలో దక్షిణాదిలో పడి చచ్చే అభిమానులు ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఐశ్వర్య రాయి అందం గురించి ఎంత పొగిడినా తక్కువే అని చెప్పవచ్చు.బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి సినిమాలలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.అంతే కాకుండా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.
ఐశ్వర్య అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan ) ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.వీరికి ఆరాధ్య అనే ఒక కూతురు కూడా ఉంది.పెళ్లి అయినా కూడా అందం విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవడం లేదు.
అంతేకాకుండా పెళ్లి తర్వాత కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది ఐశ్వర్య.ఇది ఇలా ఉంటే ఐశ్వర్య నటించిన తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ 2( Ponniyin Selvan 2 ) స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.కాగా గతంలో విడుదలైన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే.
ఇందులో ఐశ్వర్యరాయ్,త్రిష, విక్రమ్ ఇలా చాలామంది సెలబ్రిటీలు నటిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఐశ్వర్యరాయ్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.నాలుగు పదుల వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యువతకు సెగలు పుట్టిస్తోంది ఐశ్వర్య.రాజకోటలో మహారాణి రాజసం, అలాగే తరాలు మారిన తరగని అందం ఐశ్వర్యరాయ్ సొంతం అని చెప్పవచ్చు.